BREAKING
వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ!

పెద్ద చెరువు భూముల భూసేకరణ నిలిపివేయాలి,

Select Suryaa Now
పెద్ద చెరువు భూముల భూసేకరణ నిలిపివేయాలి,

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్,మండలంలోని ఏ పోలవరం గ్రామంలోని పెద్ద చెరువు ఆయకట్టు భూములను పోలవరం ప్రాజెక్టు భూసేకరణ ప్యాకేజీలో చేర్చడాన్ని తక్షణమే నిలిపివేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ పేదలు ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసిల్దార్ ఉదయ్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం సీపీఎం మండల కన్వీనర్ జి. సూర్యకిరణ్ మాట్లాడుతూ గ్రామంలోని 12 పేద కుటుంబాలు సుమారు 40 ఏళ్లుగా సర్వే నంబర్లు 133/4, 156 పరిధిలోని భూముల్లో వరి, మొక్కజొన్న సాగు చేసుకుంటున్నాయని తెలిపారు. నకిలీ డి-ఫారం పట్టాలు, పట్టాదారు పాసుపుస్తకాలతో పది ఎకరాల భూమిని భూసేకరణ ప్యాకేజీలో చేర్చి పరిహారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు, పట్టాలను సమగ్రంగా పరిశీలించి విచారణ జరపాలని, పేదలకు పట్టాలు మంజూరు చేసి వారి పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కోరారు. విచారణ పూర్తయ్యే వరకు పరిహారం చెల్లింపులను నిలిపివేయాలని, నకిలీ పత్రాల వ్యవహారంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, గ్రామ పేదలు పాల్గొన్నారు.

 రిపోర్టర్ కె వి రమణ రావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా