BREAKING
కనకవీడులో పోలీసుల పల్లె నిద్ర రేపటి నుంచి ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్–2.0 ప్రారంభం బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం.. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పోలీస్ కమిషనర్ విజయవాడ ఉత్సవ్‌–2.0 ప్రజలందరి పండుగ సరస్ మేళాతో మహిళా పారిశ్రామికవేత్తలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్ల పరిశీలన దసరా ఉత్సవాలకు 3,130 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఉపాధి కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు  అగ్రస్థానం గ్రామాల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. ప్రసిద్ధ గ్రామీ అవార్డ్స్ రేసులో ‘ధురంధర్ 2’ సాంగ్స్.. ఏకంగా 9 కేటగిరీల్లో సబ్మిషన్! అంధులను..అందరిని ఆదుకుంటున్న సదాశయ ఫౌండేషన్ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ చెక్‌ల పంచాయితీకి చెక్!

జీఓ 59 పెండింగ్ దరఖాస్తులకు నెలలోగా పరిష్కారం :మంత్రి పొంగులేటి

Select Suryaa Now
జీఓ 59 పెండింగ్ దరఖాస్తులకు నెలలోగా పరిష్కారం :మంత్రి పొంగులేటి

జీఓ 59పై  ప్రకటన

నెలలోగా దరఖాస్తులు క్లియర్

 

సీఎం రేవంత్ రెడ్డి హామీ అమలులో భాగంగా ఈ నిర్ణయమని వెల్లడి

దరఖాస్తుల పరిశీలనకు ఆదేశాలు జారీ చేశామన్న మంత్రి

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి:
తెలంగాణలో జీఓ 59 కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 500 చదరపు గజాల లోపు ఉన్న ప్లాట్లకు సంబంధించిన దరఖాస్తులను నెల రోజుల్లోగా పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన 22-ఏ సమస్యల పరిష్కార హామీ అమలులో ఇది మరో కీలక ముందడుగు అని అన్నారు. ఈ మేరకు పెండింగ్ దరఖాస్తులను పరిశీలించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం మెమో నెం. 48030 జారీ చేసిందని మంత్రి వివరించారు. "జీఓ 59 అమలులో ఎలాంటి అక్రమాలకు తావులేదు. నిబంధనల ప్రకారమే నిర్ణయాలు ఉంటాయి" అని ఆయన హామీ ఇచ్చారు. గతంలో జారీ చేసిన కన్వేయన్స్ డీడ్‌లపై కూడా సమగ్ర సమీక్ష నిర్వహిస్తామని పొంగులేటి వెల్లడించారు.
సీఎం హామీ ఇచ్చిన 24 గంటల్లోనే 22-ఏ సమస్యలపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామని... 10 నుంచి 12 రకాల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. జీఓ 118, జీఓ 76లకు అనుగుణంగా స్పష్టమైన మెమోలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ వంటి సంస్థల నుంచి ముందస్తు అనుమతులు పొంది 22-ఏ జాబితాలో ఉన్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు కూడా అనుమతి ఇస్తున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు.