BREAKING
వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ!

అద్దంకిలో ప్రజాస్వామ్య ఎన్నికల చైతన్య ర్యాలీ..

Select Suryaa Now
అద్దంకిలో ప్రజాస్వామ్య ఎన్నికల చైతన్య ర్యాలీ..

సూర్య అద్దంకి.
ప్రజా సంఘాల ఐక్యవేదిక అద్దంకి ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం దగ్గర నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు శుక్రవారం సాయంత్రం ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమమునకు ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్ మన్నం  త్రిమూర్తులు అధ్యక్షత వహించారు. కార్యక్రమం ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ డి.రవీంద్ర   మాట్లాడుతూ.. అభ్యర్థులు ఎవరైనా ఏ పార్టీ అయినా మాకు ఒకటేనని, ఏ ఒక్కరిని ప్రత్యేకించి చూడటం జరగదని.... ఓటర్   కూడా ఓటుకు నోటుకు,మధ్యo, మత్తు పానీయాలకు కరిగి పోకుండా విలువైన ఓటును మీకు ఇష్టమైన వ్యక్తికి వేసుకోవాలని...కమిషనర్ అన్నారు..తెలుగుదేశం పార్టీ నాయకులు బచ్చల శ్రీనివాస్ కుమార్ ( వాసు) మాట్లాడుతూ....రాబోయే మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఓటుకు నోటు, మద్యం, మత్తు పదార్థాలతో, బహుమతులతో ఓటర్  కు  ఎరవేసే విధానానికి స్వస్తి పలకాలని.... ఓటర్  అలాంటి వాటికి దూరంగా ఉండి వారి నమ్మిన వ్యక్తికి నమ్మకంతో అభివృద్ధి చేసే వ్యక్తికి ఓటు వేయాలని... అప్పుడే జవాబు దారి తనం  గాని,అభివృద్ధి గాని చూస్తామని    వాసు అన్నారు.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ సెల్ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్  మాట్లాడుతూ.... నేడు ఎన్నికలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా తారస్థాయికి చేరుకున్నాయని...ఎన్నికలలో ఓటుకు నోటు ను తిరస్కరించి మంచి వ్యక్తికి ఓటు వేసి మంచి సమాజానికి శ్రీకారం చుడదామని రమేష్ అన్నారు.
టిడిపి ఎస్సీ సెల్ నాయకులు పూనూరి నరేంద్ర మాట్లాడుతూ.. ప్రతి ఓటర్ దూర దృష్టి తో ఆలోచించాలని, ఓటర్ను ప్రలోపెట్టే ప్రతి చర్యను అందరూ సంయుక్తంగా ఖండించాలని, టెక్నాలజీ తో పాటు వజ్రాయుధం లాంటి ఓటును అమ్ముకోకుండా మంచి పాలనకు, విలువైన ప్రజాస్వామ్యానికి శ్రీకారం చుట్టేలా ఓటర్ బలమైన, చైతన్యమైన నిర్ణయాన్ని తీసుకోవాలని నరేంద్ర అన్నారు.
లిఖితపూర్వకమైన రిప్రెజెంటేషన్ అద్దంకి మున్సిపల్ కమిషనర్ గారికి,అలాగే తహసిల్దార్ కార్యాలయం నందు, మరియు ఆర్డీవో ఆఫీస్ నందు ముగ్గురికి రిప్రజెంటేషన్ అందజేయడమైనది. 
ఈ కార్యక్రమంలో... కావూరు రఘు చంద్, తంగిరాల వెంకటేశ్వర్లు, కేఎల్డి ప్రసాద్,చెన్నుపల్లి నాగేశ్వరరావు, జ్యోతి శ్రీమన్నారాయణ మూర్తి,మల్లాది రంగా, కరీం, జి రమేష్,రామ్ రెడ్డి,చామర్తి శ్రీనివాసరావు, హోలీ ఫెయిత్ స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.