గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ,జడ్ పీటీసీ, ఎన్నికల నిర్వహణకు మండల యంత్రాంగం సిద్ధంగా ఉండలి
ఇరగవరం సూర్య న్యూస్: గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ,జడ్ పీటీసీ, ఎన్నికల నిర్వహణకు మండల యంత్రాంగం సిద్ధంగా ఉండాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ.శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో అయన మాట్లాడారు. ప్రస్తుతం జరగబోయే ఎన్నికలు ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీల వారీగా పోలింగ్ కేంద్రాల వివరాలు, మౌలిక వసతుల కల్పన, త్రాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్యం, ర్యాంపులు, తదితర వసతులకు కలిపించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. రికార్డులు, నివేదికలు ఎన్నికలకు ఉపయోగించే సిబ్బంది వివరాలు సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలను తుచా తప్పక పాటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎమ్. సుందరాజు, సబ్ ఇన్స్పెక్టర్ మహ్మద్ నసిరుల్లా, మండలస్థాయి, గ్రామస్థాయి అధికారులు పాల్గొన్నారు.
రిపోర్టర్ దొరబాబు ఇరగవరం పశ్చిమగోదావరి జిల్లా,