BREAKING
కనకవీడులో పోలీసుల పల్లె నిద్ర రేపటి నుంచి ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్–2.0 ప్రారంభం బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం.. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పోలీస్ కమిషనర్ విజయవాడ ఉత్సవ్‌–2.0 ప్రజలందరి పండుగ సరస్ మేళాతో మహిళా పారిశ్రామికవేత్తలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్ల పరిశీలన దసరా ఉత్సవాలకు 3,130 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఉపాధి కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు  అగ్రస్థానం గ్రామాల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. ప్రసిద్ధ గ్రామీ అవార్డ్స్ రేసులో ‘ధురంధర్ 2’ సాంగ్స్.. ఏకంగా 9 కేటగిరీల్లో సబ్మిషన్! అంధులను..అందరిని ఆదుకుంటున్న సదాశయ ఫౌండేషన్ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ చెక్‌ల పంచాయితీకి చెక్!

ఫేక్‌ న్యూస్‌తో అప్రమత్తంగా ఉండాలి

Select Suryaa Now
ఫేక్‌ న్యూస్‌తో అప్రమత్తంగా ఉండాలి

 

• వాస్తవ నిర్ధారణ తర్వాతే వార్తల ప్రచురణ

• ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ సూచన

సూర్య ఆదిలాబాద్‌ : వార్తలను ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ జర్నలిస్టులకు సూచించారు. సోషల్‌, డిజిటల్‌ మీడియా విస్తరిస్తున్న నేపథ్యంలో తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, ఫేక్‌ న్యూస్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లోని టీటీడీసీ హాల్‌లో నిర్వహించిన రెండు రోజుల జర్నలిస్టుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ముగింపు సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, ధ్రువీకరించని సమాచారాన్ని ప్రచురించడం వల్ల ప్రజల్లో అపోహలు ఏర్పడతాయని పేర్కొన్నారు. కృత్రిమ మేధ (ఏఐ)తో రూపొందించిన ఫొటోలు, వీడియోలు, సమాచారాన్ని పరిశీలించకుండా నిజమని నమ్మరాదన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా జర్నలిస్టులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.

ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభంగా కీలక పాత్ర పోషిస్తుందని, ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలవాలని అన్నారు. బాధ్యతాయుతమైన జర్నలిజంతో వార్తల విశ్వసనీయతను కాపాడాలని పిలుపునిచ్చారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న జర్నలిస్టులకు సర్టిఫికెట్లు అందజేశారు.

కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వేంకటేశ్వరరావు, జిల్లా పౌర సంబంధాల అధికారి ఇ. విష్ణువర్ధన్‌, మీడియా అసోసియేషన్‌ ప్రతినిధులు రాజేశ్వర్‌, దేవేందర్‌, వినోద్‌, సురేష్‌, షాహిద్‌, వెంకట్‌, కిరణ్‌తో పాటు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.