,పుట్ల గట్ల గూడెం దేవలిపల్లి పంచాయతీల్లో నిధులు దుర్వినియోగం.
జంగారెడ్డిగూడెం, మేజర్ న్యూస్ : మండలంలోని పుట్లగట్ల గూడెం గ్రామంలో గ్రామ పంచాయతీ నిధులు సుమారు రూ. 20 లక్షల దుర్వినియోగం అయ్యాయి అంటూ శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పలు రాజకీయ పార్టీల నాయకులు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ సెక్రటరీ డి. బాలాజీ పై ఆరోపణలతో ఆందోళన చేపట్టారు. పక్కనే గల దేవులపల్లి లో ఈ సెక్రటరీ ఏ పని చేసిన కాలంలో సుమారు రూ 12 లక్షల వరకు రోడ్లు వేసినట్లుగా చూపించి పంచాయతీ నిధులను పక్కదోవ పట్టించారని విషయాన్ని పుట్లగట్లగూడెం కూడా నాయకులు తెలుసుకొని పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి గ్రామ ప్రెసిడెంట్ శీలం వెంకటరాజు, పలు రాజకీయ పార్టీల నాయకులు రెడ్డి సత్యనారాయణ, శీలం పవన్ కళ్యాణ్, మల్లిపూడి రవి, వామిశెట్టి జగదీష్, పుట్ట సాయి, శీలం కృష్ణంరాజు, అప్పన కుమారు, కామిశెట్టి భగవాన్, వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇదే విషయాన్ని పుట్ల గట్ల గూడెం పంచాయతీ స్పెషల్ ఆఫీసర్,డిప్యూటీ ఎంపీడీవో సుజాతను వివరణ కోసం మీడియా వారు వివరణ కోరగా, ఆమె చెప్పడానికి నిరాకరించారు. అనంతరం మండల స్పెషల్ అధికారి ఎం రాజుని వివరణ కోరగా తన దృష్టికి వచ్చిన వెంటనే విచారణ చేయాలని తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు
రిపోర్టర్ కె వి రమణ రావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా,