కోకో మొక్కల ఎదుగుదలపై అవగాహన
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
ఆత్రేయపురం పంచాయతీ పరిధిలో చేపట్టిన కోకో ప్లాంటేషన్ పనులను విబిజి రామ్ జి పథక సంచాలకులు జి.ఎస్. రామ్ గోపాల్ శుక్రవారం పరిశీలించారు నాటిన కోకో మొక్కల ఎదుగుదల, పెంపకంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, నీటి యాజమాన్య పద్ధతులను పరిశీలించారు నాటిన ప్రతి మొక్కను సంరక్షిస్తూ ప్లాంటేషన్‌ను విజయవంతం చేయాలని అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు అనంతరం సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్లాంటేషన్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. లబ్ధిదారులకు క్రమం తప్పకుండా అవగాహన కల్పిస్తూ, మొక్కల సంరక్షణలో వారిని భాగస్వాములను చేయాలని సూచించారు పనుల పురోగతి నివేదికలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నవీకరించాలని తెలిపారు.ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరిచేందుకు సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పథక సంచాలకులు సూచించారు ఈ కార్యక్రమంలో ఏపీవో విజయరెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ వి. సుబ్రమణ్యం, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు