BREAKING
నేటి రాశి ఫలాలు – 12 అక్టోబర్ 2026 నేటి పంచాంగం: 12 అక్టోబర్ 2026, సోమవారం రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసమే తప్పుడు ఆరోపణలు నెక్కొండ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాలు ప్రారంభం క్రీడల్లో గెలుపు ఓటములు సహజం వెంకటాపురంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా నూతన కమిటీ ఎన్నిక మండల ఏర్పాటులో డాక్టర్ సుధాకర్ రావు దే కీలక పాత్ర దంతాలపల్లి లో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు మూడో టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించిన టీమిండియా నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యం రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు మిత్రునికి పదో తరగతి స్నేహితుల సన్మానం ‘సైమన్’ తుఫాను ముప్పు...ప్రజలు ఇళ్లలోనే ఉండాలని మెక్సికో అధ్యక్షురాలు హెచ్చరిక యూరప్ మార్కెట్లో పుంజుకునేందుకు చిన్న, చౌకైన ఈవీలపై స్టెలాంటిస్ భారీ పందెం ట్రంప్ రష్యన్ డీజిల్ ఒప్పందం చట్టవిరుద్ధం కావొచ్చు: రిపబ్లికన్ సెనేటర్

విపత్తు నిర్వహణలో విద్యార్థుల భాగస్వామ్యం అత్యంత కీలకం

Select Suryaa Now
 విపత్తు నిర్వహణలో విద్యార్థుల భాగస్వామ్యం అత్యంత కీలకం

 

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్

ఎచ్చెర్ల, విపత్తుల నిర్వహణలో విద్యార్థుల భాగస్వామ్యం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ పేర్కొన్నారు. శనివారం శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ శ్రీకాకుళం చాప్టర్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే ‘రాష్ట్రస్థాయి జూనియర్ రెడ్ క్రాస్ స్టడీ కమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌’కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
రాష్ట్రంలోనే మొదటిసారిగా ఇటువంటి శిక్షణ కార్యక్రమాన్ని జూనియర్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం చాప్టర్ నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులను ఆయన అభినందించారు. విపత్తు నిర్వహణ, రక్షణ అంశాలపై యువతను, విద్యార్థులను సన్నద్ధం చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే ప్రాథమిక చికిత్సతో పాటు, గుండె ఆగిపోయి వ్యక్తి స్పృహ కోల్పోయినప్పుడు ఉపయోగపడే సి.పి.ఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) విధానంపై శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లను ఉద్దేశించి మాట్లాడుతూ... విద్యాసంస్థల వారీగా జూనియర్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదును పెంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ చైర్మన్ వై.డి. రామారావు మాట్లాడుతూ... రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా జూనియర్ రెడ్ క్రాస్ తరఫున ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీనికి శ్రీకాకుళం వేదిక కావడం సంతోషకరమని తెలిపారు. రెడ్ క్రాస్ కేవలం యుద్ధ సమయాల్లోనే కాకుండా, ఎక్కడ విపత్తులు సంభవించినా సేవా కార్యక్రమాలు అందిస్తుందని పేర్కొన్నారు. యువతను రెడ్ క్రాస్ వైపు ఆకర్షించడం, వారిలో సేవా భావాన్ని పెంపొందించడమే జూనియర్ మరియు యూత్ రెడ్ క్రాస్ ప్రధాన లక్ష్యమని చెప్పారు. భారతదేశంలో యువత ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్నందున, 2047 నాటికి ‘వికసిత భారత్’ సాధన దిశగా వారిని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

జాయింట్ కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జూనియర్, యూత్ రెడ్ క్రాస్ కమిటీ చైర్మన్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ... ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం, ప్రాణాలు కాపాడడం రెడ్ క్రాస్ సభ్యుల ముఖ్య బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ మూడు రోజుల శిక్షణను సద్వినియోగం చేసుకొని సమాజానికి మంచి పౌరులుగా సేవలు అందించాలని కోరారు.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ జనరల్ సెక్రటరీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అశ్విని కుమార్ ఫరీదా మాట్లాడుతూ... రెడ్ క్రాస్ సంస్థ ఇప్పటివరకు మూడు సార్లు నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకుందని, వ్యవస్థాపకుడైన హెన్రీ డ్యూనాంట్ తొలి నోబెల్ శాంతి బహుమతి (1901) అందుకున్నారని తెలిపారు. ఇది రెడ్ క్రాస్ సేవల విస్తృతికి నిదర్శనమని పేర్కొన్నారు.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం శాఖ చైర్మన్ పి.జగన్మోహనరావు జిల్లాలో సంస్థ ద్వారా నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం శాఖ సెక్రటరీ బి. మల్లేశ్వరరావు, ట్రెజరర్ పి. దుర్గా శ్రీనివాస్, వైస్ చైర్మన్ డాక్టర్ సుధీర్, సిబ్బంది పెంకి చైతన్య తదితరులు పాల్గొన్నారు.