BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసమే తప్పుడు ఆరోపణలు

Select Suryaa Now
రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసమే  తప్పుడు ఆరోపణలు

 

రాయపర్తి , మేజర్ న్యూస్, మండలంలోని వెంకటేశ్వర పల్లి లోని స్వయంభు వ్యక్తగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులలో బీఆర్ఎస్ నాయకులు చేసిన తప్పుడు ఆరోపణలను ఖండిస్తూ ఆదివారం కాంగ్రెస్ పార్టీ  మండల ముఖ్య నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు
ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి,తొర్రూరు బ్లాక్ కాంగ్రెస్  అధ్యక్షుడు జాటోత్ హామ్యా నాయక్,వర్ధన్నపేట ఏఎంసి వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి మాట్లాడుతూ 
బిఆర్ఎస్ దశాబ్ద పాలనలో అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రం మారింది, వాటికి వడ్డీలు చెల్లించడానికి ప్రభుత్వ ఖజానాలో 50% అవుతుంది_
_సీఎం రేవంత్ రేడ్డి నెమ్మది నెమ్మదిగా రాష్ట్రా ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తున్నారు.బీఆర్ఎస్ నాయకుల మాటలు వింటుంటే 1000 ఎలుకలు తిన్న పిల్లి కథ గుర్తొస్తుంది. బీఆర్ఎస్ గడచిన పది సంవత్సరాలలో అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేసి ఇప్పుడు వికాసం గురించి మాట్లాడడం హాస్యాస్పదం గా ఉందన్నారు వెంకటేశ్వరా పల్లి దేవస్థానము పనులను క్షేత్ర స్థాయిలో సమీక్షా త్వరలో ఉందని గ్రహించి బీఆర్ ఎస్ నాయకుల దొంగ నాటకం ఆడుతుందన్నారు రాయపర్తి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మండలానికి రూ.14.17 కోట్లతో  గోడౌన్ ను మంజూరు చేసి శంకుస్థాపన చేశారు, అన్నారు అన్నారు  మండలంలోని పెరికేడు గ్రామంలో రూ.2.50 కోట్లతో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని, పల్లె దవాఖానాతో పాటు కేశవాపురం పల్లె దవాఖానను ప్రారంభించారన్నారు
జగన్నాధపల్లి గ్రామంలో రూ.2.90 కోట్లతో ఏర్పాటు చేయనున్న కొత్త 33/11 కేవీ సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారన్నారు
గత బిఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో అభివృద్ధి శూన్యం అని ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం దేశానికే ఆదర్శం అన్నారు గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నియోజకవర్గంలో అనేక పల్లె దావఖాన లు ఏర్పాటు చేశారు అన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు మహిళల పట్ల చిన్న చూపు ఉంటుందనే విషయం మరోసారి స్పష్టమైంది అని గతంలో మహిళా అధికారిని అగౌరవ పరుస్తూ మాట్లాడిన మాటల్ని పాలకుర్తి ప్రజానికం మరువక ముందే,ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి గారి కుటుంబం పై ఎప్పటికప్పుడు తప్పుడు ఆరోపణలతో రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు, అన్నారు ఇప్పటికైనా తన ప్రవర్తన మార్చుకోవాలని యావత్ మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్నారు ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు పెండ్లి మహేందర్ రెడ్డి, రెంటాల గోవర్ధన్ రెడ్డి,ఊళ్లేగుల నర్సయ్య, రాయిని యాకయ్య,కందికట్ల యాకయ్య, రాజయ్య,ఇల్లందుల భగవాన్, గీరి గాని రాజు, బన్షా నాయక్,భూక్య పరమేష్,సుతారి యాదగిరి బండి కుమార్,రవి, రఘు నాయక్, ఉబ్బని నరసింహ, పీరాని ప్రవీణ్, మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్, సురేష్, రాయపర్తి, వరంగల్ జిల్లా