అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు
మరిపెడ, మేజర్ న్యూస్, మరిపెడ మండల పరిధిలో వేర్వేరుగా జరిగిన రెండు ఘర్షణలకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు మరిపెడ ఎస్సై గండ్రాతి సతీష్ సోమవారం తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రాంపురం గ్రామానికి చెందిన దోమల సత్యనారాయణను అదే గ్రామానికి చెందిన రాంపల్లి రంజిత్ కర్రతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడని,ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రంజిత్‌ను ఈరోజు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించామన్నారు.అదేవిధంగా వీరారం అజ్మీర తండాకు చెందిన అజ్మీర రాములుపై అదే తండాకు చెందిన అజ్మీర శ్రీనివాస్ కర్రతో దాడి గాయపరిచగా, ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. గ్రామాలలో ఎవరైనా సరే గొడవలకు, అల్లర్లకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.చట్ట ప్రకారం వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని,శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన తెలిపారు.
రిపోర్టర్ , చంద్రశేఖర్, మరిపెడ, మహబూబాబాద్ జిల్లా