దుర్గమ్మకు ప్రత్యేక పూజలు
పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్....
మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పెనుబల్లి మండలంలో సోమవారం పర్యటించారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటుచేసిన దుర్గా అమ్మవారి మందిరాలను దర్శించారు. పెనుబల్లి గ్రామంలోని బీసీ కాలనీ లో కుబేర ఆంజనేయస్వామి మందిరంలో ఏర్పాటుచేసిన అమ్మవారిని, పెనుబల్లి కోదండ రామస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే రామచంద్రరావు బంజర గ్రామానికి చెందిన మరకాల చంటికి వియ్యం బంజర గ్రామంలోని మొబైల్ షాప్ ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.