జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి
మరిపెడ, మేజర్ న్యూస్, రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన కేంద్ర ఎన్నికల కమిషన్‌ను బిజెపి ప్రభుత్వం తన జేబు సంస్థగా మార్చుకుందని, సిఇసి జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే విధులనుండి తొలగించాలని సిఐటియు మరిపెడ మండల నాయకుడు కొండ వెంకన్న డిమాండ్ చేశారు.సోమవారం మరిపెడ మండల కేంద్రంలో సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో కొండ వెంకన్న అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించారు. 2023 ఎన్నికల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, సిఇసి జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని నాయకులు పెద్దఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా కొండ వెంకన్న మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడుతోందని తీవ్రంగా మండిపడ్డారు. 'సర్' పేరుతో దేశవ్యాప్తంగా పదమూడు కోట్ల ఓట్లు, తెలంగాణ రాష్ట్రంలోనే ఒక కోటి ఓట్లను తొలగించే దుర్మార్గమైన కుట్రకు తెరలేపారని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఇటువంటి చర్యలను ప్రజాస్వామ్యవాదులంతా ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీలో కొనసాగిన అణచివేతలు, అరెస్టులను ప్రజలంతా ఖండించాలని కోరారు.జ్ఞానేష్ కుమార్‌ను మోడీ ప్రభుత్వం ఎంతోకాలం కాపాడలేదని స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమాలను నిర్బంధాలతో అణచివేయడం మోడీ ముమ్మాటికీ అవివేకమేనని ఏద్దేవా చేశారు.ప్రజాస్వామ్యంలో ప్రజా పోరాటాలను అణచివేసే హక్కు ఎవరికీ లేదని హితవు పలికారు. వెంటనే సిఇసిని తొలగించి, 2023 ఎన్నికల చట్టాన్ని రద్దు చేయాలని, లేనిపక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు జినుక సైదులు, జామ్మూర్తి శ్రీను, వెంకన్న, హనుమంతు, బద్రి, రమేష్, అంజి తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్, చందర్ , మరిపెడ, మహబూబాబాద్ జిల్లా