సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి
కోహెడ ; కోహెడ మండలంలోని సముద్రాల గ్రామంలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సోమవారం రోజున ఎంపీడీవో కు గ్రామ ఉప సర్పంచ్ చింతకింది సింగరయ్య, ఎనిమిదవ వార్డు సభ్యులు పిల్లి రజిని వినతి పత్రం ఇచ్చారు. గ్రామంలో సర్వే చేసిన తర్వాతనే నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లుఇవ్వాలని ఎంపీడీవోకు తెలియజేశారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు వాహనాలు కలిగిన భూములు ఉన్న వారిని సెలెక్ట్ చేసి లిస్టు పంపివ్వడం ఎంతవరకు సమంజసమని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల సెలక్షన్లో అవకతవకులు జరిగాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. నిరుపేదలను గుర్తించి ఇవ్వాలని ఎంపీడీవో ను కోరుచున్నాము.