ఆసరాగా పోస్ట్ ఆఫీస్ రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్
పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్...
(కిరణ్ కుమార్ ఆరిక )
రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ క్లయిమ్ మొత్తాన్ని పోస్టల్ శాఖ లబ్ధిదారుని కుటుంబానికి సోమవారం అందజేశారు. పెనుబల్లి మండలం బయ్యన గూడెం గ్రామానికి చెందిన ఉప్పు వెంకట నరసమ్మ బయ్యనిగూడెం పోస్ట్ ఆఫీస్ లో గత నాలుగు సంవత్సరాలుగా రూరల్ పోస్టల్ లైఫ్ హియర్ ఇన్సూరెన్స్ లో నెలకు 670 రూపాయలు చెల్లిస్తున్నారు. ఇటీవల ఆమె ఆకస్మికంగా మృతి చెందింది. ఆమెకు పోస్టల్ శాఖ ఇన్సూరెన్స్ క్లైమైన మొత్తం 1,23,323 రూపాయల పోస్టల్ శాఖ అధికారులు ఆదేశంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంతు మాధవ చేతుల మీదగా ఆమె భర్త ఉప్పు సత్యనారాయణకు అందజేశారు. ఈ సందర్భంగా బయ్యన్నగూడెం గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. మృతురాలి కుటుంబ సభ్యులు పోస్టల్ శాఖకు కృతజ్ఞతలు తెలియజేశారు. పోస్టల్ శాఖ అందిస్తున్న జీవిత బీమా, పొదుపు, స్కీములు, వాటి ఉపయోగాలు తెలుసుకొని వినియోగించుకోవలసిందిగా బయ్యనగూడెం పోస్ట్ ఆఫీస్ అధికారులు, సిబ్బంది సూచించారు.