సింగరేణి కార్మికులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్
సత్తుపల్లి సూర్య మేజర్ న్యూస్...
( కిరణ్ కుమార్ ఆరిక)
సింగరేణి కార్మికులకు, అధికారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మండల రాజమహే దయానంద్ అన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాగమయి సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.
గతంలో సింగరేణి అధికారులకు మాత్రమే బోనస్ లు ప్రకటించారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికులకు కూడా బోనస్ ఇస్తుందని అన్నారు. దసరా పండుగలోగా సింగరేణి అధికారులు, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు స్పష్టం చేశారని అన్నారు. సింగరేణి బ్లాక్ 3 సమస్యను వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని, బ్లాక్ 3 ను సింగరేణి కి అప్పగించేందుకు కృషి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించామని తెలిపారు. సత్తుపల్లి మండలం కిష్టారం అంబేద్కర్ నగర్ కాలనీ సింగరేణి బాధితులకు స్థలం సేకరించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చేందుకు డిప్యూటీ సీఎం భట్టి సానుకూలంగా స్పందించారని వీలైనంత త్వరగా సింగరేణి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అత్యాధునిక పరికరాలతో సూపర్ మల్టీ స్పెషాలిటీ స్థాయిలో వైద్యం అందించేందుకు సింగరేణి సంస్థ నిధులు కేటాయించేందుకు సానుకూలత తెలిపారని వివరించారు.