పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా అండ * సొంత నిధులతో ప్రతినెలా ఆర్థిక సాయం
విజయవాడ సెంట్రల్ మేజర్ న్యూస్ : ప్రభుత్వ పెన్షన్లు అందని నిరుపేదలకు ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తన సొంత నిధులతో ప్రతినెలా ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నెలవారీగా సాయం అందిస్తున్నారు. ప్రభుత్వ పెన్షన్లు అందక నిత్యావసరాలు, మందుల కొనుగోలుకు ఇబ్బందులు పడుతున్న వారికి ఈ ఆర్థిక సహాయం కొంత ఊరటనిస్తోంది. నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజల వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ, ఆపదలో ఉన్న పేదలకు అండగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సంక్షేమానికి తనవంతు సహకారం అందిస్తూ, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.