ఇరువురు తహసీల్దార్ లు, ఇరువురు డిప్యూటీ తహసిల్దార్ లపై క్రమశిక్షణ చర్యలు.
సమస్యపై వెంటనే స్పందించిన గొట్టిపాటి లక్ష్మి,మంత్రి లోకేష్.
సూర్య న్యూస్ ముండ్లమూరు. ముండ్లమూరులో పనిచేసిన ఇరువురు తహసీల్దార్ లు, ఇరువురు డిప్యూటీ తహసీల్దారులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముండ్లమూరులో తహసిల్దారుగా బాధ్యతలు నిర్వహించిన పి పార్వతి, నాంచారయ్య, డిప్యూటీ తాసిల్దార్ లో రవి కుమార్ స్రవంతి, సుబ్రహ్మణ్యం పై క్రమశిక్షణ చర్యలు ప్రభుత్వం చేపట్టింది. మండలంలోని శంకరాపురం గ్రామానికి చెందిన మేడికొండ కృష్ణారావు ఆ గ్రామానికి చెందిన వన్ బి రికార్డు కనబడలేదని నియోజకవర్గ టిడిపికి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్ విచారణ కు ఆదేశించారు. దీనిపై విచారణ చేసి అధికారులపై చర్యలు చేపడుతూ సీసీఎల్ నుండి ఉత్తర్వులు వెలుపడ్డాయి.