BREAKING
నారాయణపేటలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నేటి రాశి ఫలాలు – 15 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 15 అక్టోబర్ 2026 మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ను పరామర్శించిన వైయస్సార్సీపీ వడ్డీ రఘురాం బాలికలు శక్తివంతంగా తయారు కావాలి -- నారాయణపేట సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ టిడిపిలో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత- ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల వినూత్న నిరసన -- బోడెమ్మలు వేసి బతుకమ్మకు వినతిపత్రం అందించిన మహిళలు -- నారాయణపేటలో 2వ రోజు కొనసాగిన సమ్మె జంగారెడ్డిగూడెం వార్డుల రిజర్వేషన్లు - కమిషనర్ కేవీ. రమణ పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శంకుస్థాపన హింసాత్మక, అస్తవ్యస్త సమాజానికి బౌద్ధ ధర్మమే శరణ్యం బేతాళ సుదర్శన్ చండీదేవి అలంకారంలో వాసవీ అమ్మవారు పరిశుభ్రమైన జంగారెడ్డిగూడెం మా లక్ష్యం - ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమన్వయంతోనే పల్లెల ప్రగతి.. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కూడా మహిళలదే హవా .. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయం సాధించాలి, కంభం విజయరాజు, జెట్టి

మానకొండూరులో పాత ఇనుప సామాను దుకాణంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం

Select Suryaa Now
మానకొండూరులో పాత ఇనుప సామాను దుకాణంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం

సూర్య- మానకొండూర్:  మండల కేంద్రంలో పాత ఇనుప సామాను వ్యాపారం ముసుగులో సాగుతున్న పీడీఎస్ (రేషన్) బియ్యం అక్రమ నిల్వల గుట్టును టాస్క్ ఫోర్స్ అధికారులు రట్టు చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం మానకొండూరు మండల కేంద్రంలోని ఓ పాత ఇనుప సామాను దుకాణంపై  టాస్క్ ఫోర్స్ ఏసీపీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మిక మెరుపు దాడి నిర్వహించారు.టాస్క్ ఫోర్స్ అధికారుల కథనం ప్రకారం.. మానకొండూరు మండల కేంద్రానికి చెందిన నూనె మల్లయ్య 70 సం|| పాత ఇనుప సామాను దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే, ఇనుప సామాను వ్యాపారం ముసుగులో చుట్టుపక్కల గ్రామాల నుండి పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసే పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమంగా నిల్వ ఉంచుతున్నాడనే పక్కా సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. మంగళవారం సదరు దుకాణంలో అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీలలో ఎలాంటి అనుమతులు లేకుండా, అక్రమంగా దాచి ఉంచిన సుమారు 20 క్వింటాళ్ల పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మరియు ఇట్టి అక్రమ నిల్వలకు పాల్పడుతున్న నిందితుడు నూనె మల్లయ్యను తదుపరి చట్టపరమైన విచారణ నిమిత్తం టాస్క్ ఫోర్స్ అధికారులు మానకొండూరు సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) తిరుపతికి అప్పగించారు. ఈ మేరకు పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ లో విక్రయించడానికి నిల్వ ఉంచిన నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, నిల్వలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.