BREAKING
Title: నేటి పంచాంగం – 14 అక్టోబర్ 2026: తిథి, నక్షత్రం, వర్జ్యం మరియు శుభ ముహూర్తాల వివరాలు! నేటి రాశి ఫలాలు – 14 అక్టోబర్ 2026: ద్వాదశ రాశుల ఫలితాలు మరియు రోజువారీ సూచనలు! అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న సంచలన బెంగాలీ సినిమా 'తషెర్ ఘర్': గృహిణుల జీవితాన్ని కళ్లకు కట్టే మాస్టర్‌పీస్ నిత్యం పండ్లు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: సహజ సిద్ధమైన విటమిన్లు, ఫైబర్‌తో పరిపూర్ణ ఆరోగ్యం ఇరువురు తహసీల్దార్ లు, ఇరువురు డిప్యూటీ తహసిల్దార్ లపై క్రమశిక్షణ చర్యలు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.95 లక్షలు నిత్యం పప్పులు, శనగలు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: ఆరోగ్యానికి ప్రొటీన్, ఫైబర్ పెన్సిలిన్ పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా అండ * సొంత నిధులతో ప్రతినెలా ఆర్థిక సాయం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్: అభిమానులకు మాస్ ప్రామిస్ పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు మానకొండూరులో పాత ఇనుప సామాను దుకాణంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలపై అధికారులకు శిక్షణ సరస్ మేళాకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాత్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత

తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.95 లక్షలు

Select Suryaa Now
తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.95 లక్షలు

తాడిగడప మేజర్ న్యూస్ : తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని పోరంకి, తాడిగడప, కానూరు ప్రాంతాల్లో రూ.95 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, కృష్ణ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిగడప మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా రహదారులు, మురుగునీటి కాలువల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. హామ్‌ పథకం కింద చేపట్టాల్సిన మరిన్ని రహదారి అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయని, అవి పూర్తయితే మున్సిపాలిటీ అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మిగిలిన అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేస్తామని, రాబోయే రెండున్నరేళ్లలో సాధ్యమైనన్ని పనులు చేపట్టి తాడిగడప మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని బోడే ప్రసాద్ స్పష్టం చేశారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, తాడిగడప, కృష్ణాజిల్లా