BREAKING
నారాయణపేటలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నేటి రాశి ఫలాలు – 15 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 15 అక్టోబర్ 2026 మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ను పరామర్శించిన వైయస్సార్సీపీ వడ్డీ రఘురాం బాలికలు శక్తివంతంగా తయారు కావాలి -- నారాయణపేట సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ టిడిపిలో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత- ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల వినూత్న నిరసన -- బోడెమ్మలు వేసి బతుకమ్మకు వినతిపత్రం అందించిన మహిళలు -- నారాయణపేటలో 2వ రోజు కొనసాగిన సమ్మె జంగారెడ్డిగూడెం వార్డుల రిజర్వేషన్లు - కమిషనర్ కేవీ. రమణ పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శంకుస్థాపన హింసాత్మక, అస్తవ్యస్త సమాజానికి బౌద్ధ ధర్మమే శరణ్యం బేతాళ సుదర్శన్ చండీదేవి అలంకారంలో వాసవీ అమ్మవారు పరిశుభ్రమైన జంగారెడ్డిగూడెం మా లక్ష్యం - ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమన్వయంతోనే పల్లెల ప్రగతి.. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కూడా మహిళలదే హవా .. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయం సాధించాలి, కంభం విజయరాజు, జెట్టి

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి

Select Suryaa Now
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి

ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగం, గృహావసరాలు, పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేలా పటిష్టమైన ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఎల్‌నినో ప్రభావం, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో విద్యుత్ డిమాండ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మంగళవారం ప్రజాభవన్‌లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో ఆకస్మిక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు, సరఫరా సంసిద్ధత, బొగ్గు లభ్యత, అవసరమైన వనరుల సమీకరణ తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.