రాత్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత
ఇంద్రకీలాద్రి మేజర్ న్యూస్ : రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం రాత్రి ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ కూడా అమ్మవారి సేవలో పాల్గొని దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం వేదపండితులు వారికి ఆశీర్వచనం అందించారు. దేవాదాయశాఖ కార్యదర్శి కన్నబాబు, కమిషనర్ రామచంద్ర మోహన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.