BREAKING
నిత్యం పండ్లు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: సహజ సిద్ధమైన విటమిన్లు, ఫైబర్‌తో పరిపూర్ణ ఆరోగ్యం ఇరువురు తహసీల్దార్ లు, ఇరువురు డిప్యూటీ తహసిల్దార్ లపై క్రమశిక్షణ చర్యలు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.95 లక్షలు నిత్యం పప్పులు, శనగలు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: ఆరోగ్యానికి ప్రొటీన్, ఫైబర్ పెన్సిలిన్ పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా అండ * సొంత నిధులతో ప్రతినెలా ఆర్థిక సాయం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్: అభిమానులకు మాస్ ప్రామిస్ పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు మానకొండూరులో పాత ఇనుప సామాను దుకాణంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలపై అధికారులకు శిక్షణ సరస్ మేళాకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాత్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత డీలర్ల సమస్యలు పరిష్కరించాలి తాసిల్దార్ కు వినతి పత్రం అందించిన డీలర్లు రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి తహశీల్దార్‌కు 46 మంది డీలర్ల వినతిపత్రం ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు - సురక్షితంగా బాలుడి అప్పగింత. - ముగ్గురు నిందితుల అరెస్ట్

పది రోజులుగా వీధి దీపాలు వెలగవు.. అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం

Select Suryaa Now
పది రోజులుగా వీధి దీపాలు వెలగవు.. అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం
హైదరాబాద్ మేజర్ న్యూస్ :: ఐఎస్ సదన్ డివిజన్ లోని విష్ణు నగర్ కాలనీలో గత పది రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో వీధులన్నీ చీకటిమయంగా మారుతుండటంతో ప్రజలు, వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. రహదారిపై విద్యుత్ వైర్లు అస్తవ్యస్తంగా వేలాడుతున్న దృశ్యాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి.ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన సంబంధిత అధికారులు వీధి దీపాల సమస్యను పది రోజులుగా ఎందుకు పరిష్కరించడం లేదని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాత్రివేళల్లో చీకటి కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ప్రజల భద్రతతో చెలగాటమాడవద్దు! ఇప్పటికైనా సంబంధిత విద్యుత్, వీధి దీపాల నిర్వహణ అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత స్పందిస్తారా? ముందుగానే చర్యలు తీసుకోరా? అంటూ అధికారుల తీరుపై ప్రశ్నలు సంధిస్తున్నారు.
ప్రజలకు వెలుగులు అందించడం అధికారుల బాధ్యత. నిర్లక్ష్యాన్ని వీడి వెంటనే వీధి దీపాలను పునరుద్ధరించి, అస్తవ్యస్తంగా ఉన్న వైర్లను సురక్షితంగా సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు.