డీలర్ల సమస్యలు పరిష్కరించాలి తాసిల్దార్ కు వినతి పత్రం అందించిన డీలర్లు
ఆత్రేయపురం మేజర్ న్యూస్ రేషన్ డీలర్ల రాష్ట్ర సంఘం పిలుపుమేరకు డీలర్లు పడుతున్న ఇబ్బందుల్ని తాసిల్దార్ కి వివరించి 65 సంవత్సరాల వయసు దాటిన వారికి ఇంటి వద్దకే రేషన్ ఇవ్వడం ఖర్చుతో కూడుకున్న పని దీని నిమిత్తం ప్రభుత్వం ఇది ప్రారంభించే ముందు మూడు నెలలు చేయండి త్వరలో మీకు న్యాయం చేస్తామని అధికారులు తెలుపారు కానీ 15 నెలల దాటిన ఇంతవరకు దాని మాట ఎత్తడం లేదు
అలాగే కొత్తగా క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చి డీలర్ల పై పని ఒత్తిడి పెంచి చాలీచాలని కమీషన్లతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ ఇబ్బందులన్నీ తొలగించి కమిషన్ పెంచి 65 సంవత్సరాల ఇంటి వద్దకే రేషన్ పంపిణీ నిమిత్తం ఒక హెల్పర్ నిచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని అధికారుల్ని కోరుతున్నాము అని తాసిల్దార్ శ్రీరామచంద్రమూర్తికి వినతిపత్రం అందించారు
ఈ కార్యక్రమంలో మండల డీలర్ ప్రెసిడెంట్ జి ఎస్ వి ఎస్ రామకృష్ణ, పట్నాల నాగరాజు (నాని),శ్రీకాకుళోపుసతీష్, కృష్ణమూర్తి ,వెంకట సుబ్బరాజు కృష్ణంరాజు ,మురళీకృష్ణ ,బి రామలక్ష్మి, సిహెచ్ పూర్ణిమ, లక్ష్మీకాంతం డీలర్లు పాల్గొన్నారు