చంచల్గూడా జైలు నుండి లక్ష్మీ భాస్కర్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు
హైదరాబాద్ మేజర్ న్యూస్ :: చంచల్గూడా జైలు నుండి నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపర్డెంట్ లక్ష్మీ భాస్కర్ ను మంగళవారం ఏసీబీ అధికారులు కష్టడిలోకి తీసుకున్నారు. ఆదాయానికి మించి ఆశలు కేసులో భాగంగా మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. ఆదాయానికి మించిన కేసులో భాగంగా ఏసీబీ అధికారులు కీలక అంశాలపై ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ ను సంబంధించిన ఆస్తుల వ్యవహారంలో పూర్తి వివరాలు సేకరించడంపై ఏసీబీ అధికారులు దృష్టి సాధించారు. ముఖ్యంగా ఆస్తులు కొనుగోలు పెట్టుబడులు ఆర్థిక లావాదేవీలు సంబంధించిన వివరాల రాబెట్టేందుకు విచారణ చేపట్టన్నారు. ఆస్తుల కొనుగోలు నిధులు ఎక్కడ నుండి వచ్చాయి? బావా దేవిల వెనుక ఎవరున్నారు? బినామీల పేర్లతో ఆస్తులు ఏమైనా కొనుగోలు చేశారా? ఇలాంటి వాటిపై ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ ను సంబంధించిన 100 కోట్లకు పైగా విలువైన ఆస్తులను గురించి నటి సమాచారం ఆస్తులకు సంబంధించిన పత్రాలు వాటి కొనుగోలు జరిగిన ఆర్థిక లావాదేవీలు వివరాలను అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. మూడు రోజులు కస్టడీ సమయంలో కీలక సమాచారం సేకరించడమే లక్ష్యంగా ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు