పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ
విజయవాడ సెంట్రల్ మేజర్ న్యూస్ : పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించి ఆపద సమయంలో అండగా నిలవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తోందని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. మంగళవారం సింగ్‌నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో 58వ డివిజన్‌కు చెందిన తొమ్మిది మంది లబ్ధిదారులకు రూ.5.89 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద కుటుంబాలు వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్నాయని, అర్హులకు ఆర్థిక సాయం అందించడం ద్వారా వారి భారం కొంతమేర తగ్గుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ, అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తోందన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, మాజీ కార్పొరేటర్లు పిరియ జగదాంబ, ఎరుబోతు శ్రావణి, డివిజన్ అధ్యక్షుడు కూర్మాపు దుర్గారావు, ఇన్‌చార్జి పిరియ సోమేశ్వరరావు, క్లస్టర్ ఇన్‌చార్జి అలా తారక రామారావు, అమర్నాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.