BREAKING
Title: నేటి పంచాంగం – 14 అక్టోబర్ 2026: తిథి, నక్షత్రం, వర్జ్యం మరియు శుభ ముహూర్తాల వివరాలు! నేటి రాశి ఫలాలు – 14 అక్టోబర్ 2026: ద్వాదశ రాశుల ఫలితాలు మరియు రోజువారీ సూచనలు! అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న సంచలన బెంగాలీ సినిమా 'తషెర్ ఘర్': గృహిణుల జీవితాన్ని కళ్లకు కట్టే మాస్టర్‌పీస్ నిత్యం పండ్లు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: సహజ సిద్ధమైన విటమిన్లు, ఫైబర్‌తో పరిపూర్ణ ఆరోగ్యం ఇరువురు తహసీల్దార్ లు, ఇరువురు డిప్యూటీ తహసిల్దార్ లపై క్రమశిక్షణ చర్యలు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.95 లక్షలు నిత్యం పప్పులు, శనగలు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: ఆరోగ్యానికి ప్రొటీన్, ఫైబర్ పెన్సిలిన్ పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా అండ * సొంత నిధులతో ప్రతినెలా ఆర్థిక సాయం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్: అభిమానులకు మాస్ ప్రామిస్ పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు మానకొండూరులో పాత ఇనుప సామాను దుకాణంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలపై అధికారులకు శిక్షణ సరస్ మేళాకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాత్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలపై అధికారులకు శిక్షణ

Select Suryaa Now
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలపై అధికారులకు శిక్షణ

విజయవాడ కార్పొరేషన్ మేజర్ న్యూస్ : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహించనున్న 2026 రెండో సాధారణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు మంగళవారం గవర్నర్‌పేటలోని ఐవీ ప్యాలెస్‌లో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ఎన్నికల నోడల్ అధికారి, అదనపు కమిషనర్ ఏ. రవీంద్రరావు, ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి డాక్టర్ డి. హరీష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నామినేషన్ల స్వీకరణ, ఎన్నికల నివేదికల తయారీ, పోలింగ్ ప్రక్రియ, ఎన్నికల నిర్వహణలో పాటించాల్సిన నిబంధనలు, విధివిధానాలపై అధికారులకు అవగాహన కల్పించారు. మేయర్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన అధికారులు నిర్దేశిత సమయానికి శిక్షణకు హాజరుకావాలని, రిటర్నింగ్ అధికారుల హ్యాండ్‌బుక్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఎన్నికల మార్గదర్శకాలను పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు ముందస్తు సన్నద్ధతతో ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, హౌసింగ్ పీడీ రజనీకుమారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, వెస్ట్ డీటీఈ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.