telanagana
బీ టి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలోని 6వ వార్డ్ టెంపుల్ రాక్ ఎనక్లేవ్ లో రూపాయలు 25లక్షల కంటోన్మెంట్ బోర్డ్ నిధులతో బిటి (బి టి) రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ మెంబర్ బానుక నర్మద మల్లికార్జున్. ఈ సందర్భంగా బానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ 303 కోట్ల రూపాయల తో రానున్న రోజులలో కంటోన్మెంట్ వ్యాప్తంగా బిటి రోడ్లు, డ్రైనేజ్ లు నిర్మాణం, వీధి దీపాలు మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వారు తెలిపారు. మన స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ సహకారంతో ముఖ్య సమస్యలపైన ప్రత్యేక దృష్టి సారించి వాటిని తత్వమే పరిష్కరించే విధంగా కృషి చేస్తామని వారు తెలపడం జరిగింది.అలాగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎంపీ గారు వీడియో కాల్ ద్వారా వీక్షించడం మరియు కాలనీ వాసులతో సంభాషించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి వార్డ్ అధ్యక్షులు ప్రతీక్ జైన్ గారు,బిజెపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ కి సంబంధించి కాలనీ ప్రెసిడెంట్ మురుగేషన్, శ్రీనివాస్ గౌడ్, అమర్ షా, శశికాంత్, జలాన్, సదానంద రెడ్డి, నీలాన్, మోహియోద్దీన్, శ్రీనివాస్, చంద్రారెడ్డి, శర్మ, ఉత్తమ్ చాంద్, రేవతి, వేణుగోపాల చారి మరియు తదితర కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొనటం జరిగింది.