BREAKING
ఇరువురు తహసీల్దార్ లు, ఇరువురు డిప్యూటీ తహసిల్దార్ లపై క్రమశిక్షణ చర్యలు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.95 లక్షలు నిత్యం పప్పులు, శనగలు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: ఆరోగ్యానికి ప్రొటీన్, ఫైబర్ పెన్సిలిన్ పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా అండ * సొంత నిధులతో ప్రతినెలా ఆర్థిక సాయం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్: అభిమానులకు మాస్ ప్రామిస్ పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు మానకొండూరులో పాత ఇనుప సామాను దుకాణంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలపై అధికారులకు శిక్షణ సరస్ మేళాకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాత్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత డీలర్ల సమస్యలు పరిష్కరించాలి తాసిల్దార్ కు వినతి పత్రం అందించిన డీలర్లు రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి తహశీల్దార్‌కు 46 మంది డీలర్ల వినతిపత్రం ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు - సురక్షితంగా బాలుడి అప్పగింత. - ముగ్గురు నిందితుల అరెస్ట్ రేయింబవళ్లు మెరిసే చర్మం, ఒత్తైన జుట్టు కోసం నైట్ కేర్ రొటీన్: రాత్రి వేళ పాటించాల్సిన కీలక సూత్రాలు

మేకల కాపరి పై అటవీ డిప్యూటీ రేంజ్ అధికారి దాడి

Select Suryaa Now
మేకల కాపరి పై అటవీ డిప్యూటీ రేంజ్ అధికారి దాడి

 

•  అటవీ కార్యాలయం ఎదుట రోడ్డు పై బైటాయించి ధర్నా..

పెంబి, సూర్య :

మేకలను మేపడానికి అడవికి వెళ్లిన గిరిజన ఆదివాసీ వ్యక్తి పై విచక్షణ రహితంగా దాడి చేసిన ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి ప్రతాప్ నాయక్ ను శిక్షించాలని కోరుతూ పెంబి మండలంలోని ఆదివాసీ గిరిజనలు,మండల నాయకులు రోడ్డు పై బైటాయించి ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని తాటిగూడ పరిధిలోని కోలాం గూడా కి చెందిన మేకల కాపరి, తాటిగూడ గ్రామానికి చెందిన గుగ్లావత్ శ్రీనివాస్ లోతర్య తండా గ్రామ సమీపంలోని అడవికి రోజు వారిగా మేకల మందను తీసుకొని మేపడానికి వెళ్లారు. అక్కడ అడవిలో మేకలు చెట్టు కొమ్మలు తింటున్న క్రమంలో  పెంబి అటవీ కార్యాలయ డిప్యుటీ రేంజ్ అధికారి ప్రతాప్ నాయక్ ఒక్కసారిగా మేకల కాపరి ఆత్రం శేషు రావు పై దాడికి దిగినట్టు బాధితుడు తెలిపాడు. తనపై విచక్షణ రహితంగా పిడి గుద్దులు గుద్దుతూ,బూతులు తిట్టాడని ఆవేదన వ్యక్తం చేసాడు.ఈ ఘటన లో గాయ పడ్డ ఆత్రం శేషు రావుని చికిత్స నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.

 

-అటవీ అధికారుల తీరుపై నిరసన 

-- రోడ్డు పై బైటాయింపు, కార్యాలయం ఎదుట ధర్నా..

 

పెంబి మండలం లో అటవీ అధికారుల తీరుపై మండల నాయకులు, ప్రజలు  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి అటవీ కార్యాలం ఎదుట రోడ్డు పై బైటాయించారు. ఆదివాసీ వ్యక్తి పై  విచక్షణ రహితంగా దాడి చేసిన డిప్యూటీ రేంజ్ అధికారి ప్రతాప్ నాయక్ ను వెంటనే విధుల నుండి తొలగించాని డిమాండ్ చేసారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ పెంబి మండలంలో ఆదివాసీ, గిరిజన లపై రోజు రోజుకు అటవీ అధికారుల దాడులు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. ఆంక్షల పేరుతో అభివృద్ధి ని అడ్డుకుంటున్నారని ద్వజమెత్తారు. ఆదివాసీల జీవనోపాధి పై దాడి చేస్తూ అభివృద్ధి కి దూరం చేస్తున్నారని అన్నారు.డిప్యూటీ రేంజ్ అధికారిని సస్పెండ్ చేసి, బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో నాయకులు సల్ల స్వప్నిల్ రెడ్డి, సల్ల నరేందర్ రెడ్డి,ఐదు వెంకటేష్,గుడిసె రమేష్, సర్పంచులు వనిత శ్రీనివాస్, సత్యనారాయణ స్వామి, గంగాధర్,లోతర్య మాజీ సర్పంచ్ విలాస్, నాయకులు సుతారి మహేందర్, గాండ్ల శంకర్, తాటిగూడ, లోతర్య గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.