రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి తహశీల్దార్‌కు 46 మంది డీలర్ల వినతిపత్రం
కొత్తపేట,మేజర్ న్యూస్:రేషన్ పంపిణీలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండల రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో మండలంలోని 46 మంది రేషన్ డీలర్లు మంగళవారం కొత్తపేట రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ వై.రాంబాబును కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి,తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.ఈ-పోస్ యంత్రాలు,క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానంలో డీలర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరింది.రేషన్ డీలర్లకు గౌరవ వేతనం కల్పించడంతో పాటు కమిషన్ పెంచాలని,పెండింగ్ బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేసారు.
అలాగే రేషన్ డీలర్లకు సామాజిక భద్రత,ఆరోగ్య సదుపాయాలు,ప్రమాద బీమా వంటి సంక్షేమ ప్రయోజనాలు కల్పించాలని,రేషన్ దుకాణాల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరింది.ప్రభుత్వం డీలర్ల సమస్యలపై సానుకూలంగా స్పందించి,వారి జీవనోపాధికి భరోసా కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల రేషన్ డీలర్స్ సంఘం అధ్యక్షుడు నల్లం బాల వెంకటరమణమూర్తి,సెక్రటరీ బొరుసు వీరభద్రరావు,వీధి భాస్కరరావు,గాదం శ్రీను,మెహర్ బాబా,గనిశెట్టి శ్రీనివాసరావు,గోలకోటి శ్రీను తదితర రేషన్ డీలర్లు పాల్గొన్నారు.