కామాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని కస్తూర్బా స్కూల్ సమీపంలో నివసించే కె. రవి శంకర్ (64) అనే వ్యక్తి అదృశ్యమయ్యారు. ఈనెల 11 వ తేదీన మధ్యాహ్నం సుమారు 1:30 గంటలకు ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకో కపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినప్పటికీ ఆయన ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు కామాటిపుర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కనిపించకుండా పోయిన వ్యక్తి చామనచాయ రంగు కలిగి, సుమారు 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు ఉండి, వెళ్లిన సమయంలో నీలం రంగు షర్టు, గోధుమ రంగు ప్యాంటు ధరించి ఉన్నారు. ముఖంపై పుట్టుమచ్చ గుర్తింపు గుర్తుగా ఉంది. తెలుగు, హిందీ భాషలు మాట్లాడగలరు. సదరు వ్యక్తి మానసిక అనారోగ్యంతో బాధపడుతూ 2020 సంవత్సరం నుండి ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. పై వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు లేదా ఎక్కడైనా కనిపించిన వారు వెంటనే కామాటిపుర పోలీస్ స్టేషన్కు సమాచారం అందించవలసిందిగా కామాటిపుర పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.