BREAKING
తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.95 లక్షలు నిత్యం పప్పులు, శనగలు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: ఆరోగ్యానికి ప్రొటీన్, ఫైబర్ పెన్సిలిన్ పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా అండ * సొంత నిధులతో ప్రతినెలా ఆర్థిక సాయం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్: అభిమానులకు మాస్ ప్రామిస్ పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు మానకొండూరులో పాత ఇనుప సామాను దుకాణంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలపై అధికారులకు శిక్షణ సరస్ మేళాకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాత్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత డీలర్ల సమస్యలు పరిష్కరించాలి తాసిల్దార్ కు వినతి పత్రం అందించిన డీలర్లు రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి తహశీల్దార్‌కు 46 మంది డీలర్ల వినతిపత్రం ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు - సురక్షితంగా బాలుడి అప్పగింత. - ముగ్గురు నిందితుల అరెస్ట్ రేయింబవళ్లు మెరిసే చర్మం, ఒత్తైన జుట్టు కోసం నైట్ కేర్ రొటీన్: రాత్రి వేళ పాటించాల్సిన కీలక సూత్రాలు గ్రామ రెవెన్యూ సేవకుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి - సబ్బెళ్ళ కృష్ణారెడ్డి.

ఉద్యోగుల డీఏలను వెంటనే విడుదల చేయాలి

Select Suryaa Now
ఉద్యోగుల డీఏలను వెంటనే విడుదల చేయాలి
తెలంగాణ బ్యూరో ప్రతినిధి :ఉద్యోగులకు రావలసిన డీఏలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది.నారాయణ గూడా లో జరిగిన
తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ  సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పలు ముఖ్యమైన సమస్యలపై చర్చించారు. క్రింది డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
 ముఖ్య డిమాండ్లు:
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగులో ఉన్న రెండు విడతల కరువు భత్యం
01-01-2024 మరియు 01-07-2024 నుండి రావలసిన 3.64% మరియు 2.73% మొత్తం 6.37% విడుదల చేయుటకు రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయానికి గాను రాష్ట్రప్రభుత్వానికి ఉద్యోగుల సంఘం సంతోషాన్ని తెలియచేస్తున్నాము.
మిగిలిన 4 డీఏలను వెంటనే మంజూరు చేయాలి.
01-01-2025, 01-07-2025, 01-01-2026 మరియు 01-07-2026 నుండి రావలసిన డీఏలను ఆలస్యం చేయకుండా విడుదల చేయాలి.

01-07-2023 నుండి అమలులోకి రావలసిన వేతన సవరణ సంఘం (PRC)ను అమలు చేయాలి వెంటనే తెప్పించుకొని అమలు చేయాలి
 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు CPS విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (OPS)ను అమలు చేయాలి.
ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థిక సమస్యలను పరిష్కరించాలి.
పెండింగ్‌లో ఉన్న బిల్లులు, బకాయిలు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని,
 ఉద్యోగుల హెల్త్ స్కీం ను
సమర్థవంతంగా అమలు చేయాలని,
ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా EHSను పటిష్టంగా అమలు చేసి, నగదు రహిత వైద్య సేవలు సులభంగా అందుబాటులోకి తీసుకురావాలని,
 ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ఇతర సమస్యలను పరిష్కరించాలని,
ఉద్యోగులపై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రయాణం/ఇంధనం తదితర అంశాలకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని,
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చలు జరిపి పరిష్కారం చూపాలని,
ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు నిర్వహించి, సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని,సమావేశం డిమాండ్ చేసింది.
ఈ సమావేశం లో  ఎమ్. రవీంద్ర కుమార్, అధ్యక్షులు, ఏ. పద్మాచారి గౌరవ చైర్మన్,  ch. హరీష్ కుమార్ రెడ్డి ప్రధాన కార్యదర్శి, v. సురేందర్ ఆర్గనైసింగ్ సెక్రటరీ,  పి  కృష్ణా రావు, సెక్రటరీ,  పి . కృష్ణ మూర్తి డైరీ చైర్మన్,ఎన్. నర్సింగ్ రావు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు   పవన్ కుమార్,  బోరెదా ప్రవీణ్ కుమార్, పి . పరమేష్ తదితర కార్యవర్గ సభ్యులు హాజరైనారు.