గ్రామ రెవెన్యూ సేవకుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి - సబ్బెళ్ళ కృష్ణారెడ్డి.
అనపర్తి మేజర్ న్యూస్. తమ డిమాండ్ల సాధన కోసం గ్రామ రెవెన్యూ సేవకులు గత 28 రోజులుగా జరుగుతున్న సమ్మెపై ప్రభుత్వం తక్షణ స్పందించి వీఆర్ఏల డిమాండ్లను నెరవేర్చాలని వైయస్ఆర్ సిపి జిల్లా అధికార ప్రతినిధి, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం అనపర్తి లోని మండల తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న వీఆర్ఏల దీక్ష శిబిరాన్ని కృష్ణారెడ్డి సందర్శించి మద్దతు తెలియజేశారు.
ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకులకు ఇస్తున్న పదివేల రూపాయల జీతం సరిపోదని, కనీస వేతనం 18 వేలకు పైగా కల్పించాలని, గ్రామ రెవెన్యూ సేవకులకు అర్హతను బట్టి పదోన్నతులు కల్పించాలనే డిమాండ్లతో సహా వారి చేస్తున్న డిమాండ్లు సహేతుకమైనవని రాష్ట్రంలో నిత్యవసర వస్తువులు విపరీతంగా పెరిగి సామాన్యుడి బ్రతుకు భారంగా మారిందని రెవెన్యూ సహాయకులకు ఇస్తున్న పదివేల రూపాయలు జీతం వారి కుటుంబ పోషణకు సరిపోదని ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించాలని అన్నారు.
డెల్టా ప్రాంతంలో రైతులు పంట చేతికి వచ్చే సమయం వస్తుందని ఇప్పటికే అల్పపీడనం తుఫాను వంటి హెచ్చరికలు వాతావరణ కేంద్రం చేస్తుందని, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయని ఇటువంటి సమయంలో గ్రామ రెవెన్యూ సహాయకులు విధులకు దూరంగా ఉంటే గ్రామాలలో చాలా ఇబ్బందులు తలెత్తుతాయని కాబట్టి ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి తక్షణమే స్పందించివీరి డిమాండ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెవిన్యూ మంత్రి ఆమోదించి సమ్మె విరమింప చేయాలని వైయస్ఆర్ సిపి తరపున డిమాండ్ చేస్తున్నామని సబ్బెళ్ళ కృష్ణారెడ్డి అన్నారు.