BREAKING
పంపా నదీ తీరంలో కార్తీక ఆఖరి సోమవారం ఏర్పాట్లపై ఈవో లక్ష్మీ శివజ్యోతి ప్రత్యేక సమీక్ష బడుగుల జీవితాల్లో అక్షర వెలుగులు నింపిన జ్యోతి అణగారిన వర్గాల, మహిళల హక్కుల కోసం పోరాడిన మార్గదర్శకుడు మహాత్మా జ్యోతిరావ్ ఫులే సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా: 200 మంది సిబ్బందితో పటిష్ట భద్రత మున్సిపల్ చైర్మన్ శేషారావుకు ‘ప్రజామిత్ర’ పురస్కారం భారత ఆర్మీ జవాన్ వేణు కు ఘనంగా నివాళులు శ్రీ సత్యదేవుని నిత్య అన్నదాన పథకానికి రూ.2 లక్షల విరాళం డిగ్రీ కళాశాల రంపచోడవరం క్యాంపస్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహణ పగడ్బందీగా ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమం కార్తీక మాసం మూడవ శనివారం.. అన్నవరంలో భక్తజన సంద్రం! కలెక్టర్, ఎస్ పి లను18వ అయ్యప్ప పడి పూజకు ఆహ్వానించిన గురుస్వాములు డిగ్రీ విద్యార్థినులకు ఎస్పీ కె. చక్రవర్తి షూస్ బహూకరణ పెళ్లి వేడుక సందడితో తఖబ్బలల్లా పాట.. 40 డేస్ ఆఫ్ హౌస్ పార్టీ నుంచి రెండో గీతం విడుదల గోవాలో అట్టహాసంగా ముగిసిన 57వ ఇఫీ వేడుకలు.. ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి, అవార్డుల విజేతలు వీరే వృషకర్మలో ఊహించని ట్విస్ట్.. మీనాక్షి చౌదరి పాత్రపై దర్శకుడు కార్తీక్ దండు ఆసక్తికర హింట్

కలెక్టర్, ఎస్ పి లను18వ అయ్యప్ప పడి పూజకు ఆహ్వానించిన గురుస్వాములు

Select Suryaa Now
కలెక్టర్, ఎస్ పి లను18వ అయ్యప్ప పడి పూజకు ఆహ్వానించిన గురుస్వాములు

రంపచోడవరం సూర్య ప్రతినిధి :
రంపచోడవరంలో 18వ పడి పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సూరిశెట్టి కృష్ణ గురుస్వామి 18వ శబరిమల యాత్ర సందర్భంగా సోమవారం రాత్రి 8 గంటలకు బ్రహ్మశ్రీ జి.ప్రసన్న కుమార్ శర్మ గురుస్వామి వారిచే 18వ పడి పూజ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సూరిశెట్టి బ్రదర్స్ ఆధ్వర్యంలో సూరిశెట్టి జగన్నాధరావు (నాని) 14వ పడిగా నిర్వహిస్తున్నారు.ఈ మహోత్సవానికి విచ్చేయనున్న పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ ,జిల్లా ఎస్పీ కే.చక్రవర్తి కు నిర్వాహకులు ఘనంగా ఆహ్వానం పలికారు. జిల్లా కలెక్టర్ ,ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేసి, శాలువాతో సత్కరించారు. 18వ పడి పూజకు విచ్చేయుచున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ వారికి అయ్యప్ప స్వాములందరికీ స్వాగతం - సుస్వాగతం అని నిర్వాహకులు తెలిపారు.ఈ పడి పూజ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.ఈ కార్యక్రమంలో సూరిశెట్టి బ్రదర్స్  ,శ్రీ బ్రమరాంబిక మల్లికార్జున  దేవాలయ అర్చకులు ప్రసన్న కుమార్ , బాబ్జి, శివ,తరుణ్ స్వామి తదితర స్వాములు పాల్గొన్నారు.