BREAKING
పిఠాపురం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం పంపా నదీ తీరంలో కార్తీక ఆఖరి సోమవారం ఏర్పాట్లపై ఈవో లక్ష్మీ శివజ్యోతి ప్రత్యేక సమీక్ష బడుగుల జీవితాల్లో అక్షర వెలుగులు నింపిన జ్యోతి అణగారిన వర్గాల, మహిళల హక్కుల కోసం పోరాడిన మార్గదర్శకుడు మహాత్మా జ్యోతిరావ్ ఫులే సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా: 200 మంది సిబ్బందితో పటిష్ట భద్రత మున్సిపల్ చైర్మన్ శేషారావుకు ‘ప్రజామిత్ర’ పురస్కారం భారత ఆర్మీ జవాన్ వేణు కు ఘనంగా నివాళులు శ్రీ సత్యదేవుని నిత్య అన్నదాన పథకానికి రూ.2 లక్షల విరాళం డిగ్రీ కళాశాల రంపచోడవరం క్యాంపస్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహణ పగడ్బందీగా ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమం కార్తీక మాసం మూడవ శనివారం.. అన్నవరంలో భక్తజన సంద్రం! కలెక్టర్, ఎస్ పి లను18వ అయ్యప్ప పడి పూజకు ఆహ్వానించిన గురుస్వాములు డిగ్రీ విద్యార్థినులకు ఎస్పీ కె. చక్రవర్తి షూస్ బహూకరణ పెళ్లి వేడుక సందడితో తఖబ్బలల్లా పాట.. 40 డేస్ ఆఫ్ హౌస్ పార్టీ నుంచి రెండో గీతం విడుదల

పగడ్బందీగా ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమం

Select Suryaa Now
పగడ్బందీగా ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమం

- బహిరంగ మద్యo, గంజాయి సాగు, అక్రమ నివారణ, ట్రాఫిక్ నియంత్రణపై ఉక్కు పాదం
- అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు
- ఎస్.పి  కె. చక్రవర్తి ఐ. పి. ఎస్ 
రంపచోడవరం సూర్య ప్రతినిధి :
శనివారం పోలవరం జిల్లా ఎస్పీ కే. చక్రవర్తి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ చక్రవర్తి గత మూడు నెలల్లో పోలీస్ శాఖ సాధించిన పనితీరును వివరించారు.పోలవరం జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణ, గంజాయి నిర్మూలన, రహదారి భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ సాధించిన పనితీరును జిల్లా ఎస్పీ  కె. చక్రవర్తి, ఐపీఎస్ తెలిపారు. 
రన్ ఫర్ యూనిటీ మారథాన్‌లో పాల్గొన్న బాలికలకు స్పోర్ట్స్ షూలు అందజేసి ప్రోత్సహించారు.రూ.7,18,200 విలువైన 43 పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. 12 ఎన్ డి పి ఎస్ కేసులు నమోదు చేసి 20 మందిని అరెస్టు చేశారు. రూ.1.20 కోట్ల విలువైన 220 కిలోల గంజాయి, హాషిష్ ఆయిల్, 10 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.గంజాయి అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన వారిపై 25 ఉత్తర్వులు జారీ చేసి 17 మందిని నిర్బంధించారు.105 కేసులు నమోదు చేసి 105 మందిని అరెస్టు చేశారు. నాటుసారాపై 16 కేసులు నమోదు చేసి 183 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని 1,200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై 31, ఎం వి యాక్ట్ కింద 3,803 కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. హెల్మెట్ లేని వారికి హెల్మెట్లు కొనుగోలు చేయించారు.
త్రిశూల్ కార్యక్రమం కింద 307 సదస్సులు, రోడ్డు భద్రతపై 70 సమావేశాలు నిర్వహించారు.
1,169 మంది బలగాలతో జడ్పీటీసీ ,ఎంపీటీసీ ఎన్నికలు, 371 మంది బలగాలతో మొదటి విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించారు.
రేపు జరగనున్న ఎన్నికల కోసం 9 పోలీస్ స్టేషన్ల పరిధిలో 681 మంది సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. చివరిగా ఎస్పీ చక్రవర్తి మాట్లాడుతూ పర్యటకులు జలపాతాల వద్ద బహిరంగంగా మద్యం సేవిస్తున్నారని, ఆహ్లాదం , ఆహ్లాదం గానే ఉండాలి కానీ  మితిమీరి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని  ఏమైనా జరిగితే వెనకాల కుటుంబాలు బాధపడతాయని  పర్యాటకానికి వచ్చి  అనవసరంగా కేసులు పెట్టుకోవద్దని, మీరు బాధపడి ఇతరులను బాధ పెట్టవద్దని హితవు పలికారు.బహిరంగంగా మద్యం చేయిస్తున్న వారిపై 803 మంది పై కేసు నమోదు చేసి 1,63,000 మూడు వేలు అపరాధ రుసుము వసూలు చేశారని తెలిపారు.నేర నియంత్రణ, ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.ఈ కార్యక్రమంలో రంపచోడవరం డీఎస్పీ పి. అష్రఫ్ అలీ, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ జె. భాను ప్రసాద్, సీఐ టి.జి.ఎన్. ప్రసాద్, ఎస్ ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు.