BREAKING
పంపా నదీ తీరంలో కార్తీక ఆఖరి సోమవారం ఏర్పాట్లపై ఈవో లక్ష్మీ శివజ్యోతి ప్రత్యేక సమీక్ష బడుగుల జీవితాల్లో అక్షర వెలుగులు నింపిన జ్యోతి అణగారిన వర్గాల, మహిళల హక్కుల కోసం పోరాడిన మార్గదర్శకుడు మహాత్మా జ్యోతిరావ్ ఫులే సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా: 200 మంది సిబ్బందితో పటిష్ట భద్రత మున్సిపల్ చైర్మన్ శేషారావుకు ‘ప్రజామిత్ర’ పురస్కారం భారత ఆర్మీ జవాన్ వేణు కు ఘనంగా నివాళులు శ్రీ సత్యదేవుని నిత్య అన్నదాన పథకానికి రూ.2 లక్షల విరాళం డిగ్రీ కళాశాల రంపచోడవరం క్యాంపస్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహణ పగడ్బందీగా ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమం కార్తీక మాసం మూడవ శనివారం.. అన్నవరంలో భక్తజన సంద్రం! కలెక్టర్, ఎస్ పి లను18వ అయ్యప్ప పడి పూజకు ఆహ్వానించిన గురుస్వాములు డిగ్రీ విద్యార్థినులకు ఎస్పీ కె. చక్రవర్తి షూస్ బహూకరణ పెళ్లి వేడుక సందడితో తఖబ్బలల్లా పాట.. 40 డేస్ ఆఫ్ హౌస్ పార్టీ నుంచి రెండో గీతం విడుదల గోవాలో అట్టహాసంగా ముగిసిన 57వ ఇఫీ వేడుకలు.. ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి, అవార్డుల విజేతలు వీరే వృషకర్మలో ఊహించని ట్విస్ట్.. మీనాక్షి చౌదరి పాత్రపై దర్శకుడు కార్తీక్ దండు ఆసక్తికర హింట్

డిగ్రీ విద్యార్థినులకు ఎస్పీ కె. చక్రవర్తి షూస్ బహూకరణ

Select Suryaa Now
డిగ్రీ విద్యార్థినులకు ఎస్పీ కె. చక్రవర్తి  షూస్ బహూకరణ

రంపచోడవరం, సూర్య ప్రతినిధి :
పోలవరం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్  కె. చక్రవర్తి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రంపచోడవరం విద్యార్థినులకు క్రీడా షూస్‌ను బహూకరించారు.ఇటీవల నిర్వహించిన ఏక్తా దివస్ (జాతీయ ఐక్యతా దినోత్సవం) సందర్భంగా నిర్వహించిన 5 కె రన్‌లో కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు షూస్ లేకుండానే పరుగు పందెంలో పాల్గొని ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించారు. విద్యార్థినుల క్రీడా స్ఫూర్తి, పట్టుదల, ప్రతిభను గుర్తించిన జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి, ఐపీఎస్  వారిని మరింతగా క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారి షూ సైజులకు అనుగుణంగా క్రీడా షూస్‌ను బహూకరించారు.
పి. వీరలక్ష్మి – ద్వితీయ సంవత్సరం, ఎ. వెంకట శ్రీ , పి. ప్రశాంతి ,పి. ప్రవీణ – ప్రథమ సంవత్సరం విద్యార్థినులకు షూస్ బహుకరించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. వి.కె.టి. మహాలక్ష్మి , వ్యాయామ అధ్యాపకుడు ప్రభాకర్ రావు జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి, ఐపీఎస్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థినుల క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పోలవరం జిల్లా పోలీస్ శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ డి పి ఓ అష్రఫ్ అలీ, సి. ఐ ప్రసాద్ , ఎస్ ఐ రమేష్ పాల్గొన్నారు