ఏసీబీకి చిక్కిన లంచావతారం .. రూ. 20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం
హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం సంచలన దాడులు నిర్వహించారు. హెచ్‌ఎండీఏ (HMDA) పరిధిలోని ఓ లేఔట్ అనుమతి కోసం భారీగా లంచం డిమాండ్ చేసిన అధికారుల గుట్టురట్టయింది.
బాధితుని ఫిర్యాదు మేరకు.. హెచ్‌ఎండీఏలో ఉన్న లేఔట్ కోసం ఎమ్మార్వో సుదర్శన్, సర్వేయర్ శ్రీనివాసులు రూ. 30 లక్షలు లంచంగా డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా రూ. 20 లక్షలు నగదు రూపంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ దాడిలో ఎమ్మార్వో సుదర్శన్‌తో పాటు సర్వేయర్ శ్రీనివాసులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకుని, తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు కొనసాగిస్తున్నారు. రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి తంతుపై ఈ దాడులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.