శ్రీ దుర్గా మల్లేశ్వర అమ్మవారికి వెండి కిరీటం సమర్పించిన ఎమ్మెల్యే బడేటి చంటి,మీనా దంపతులు
ఏలూరు దక్షిణపు వీధిలోని శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ దుర్గా మల్లేశ్వర, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఎమ్మెల్యే బడేటి చంటి, మీనా దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర అమ్మవారికి భక్తిశ్రద్ధలతో వెండి కిరీటాన్ని సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ పూజా కార్యక్రమంలో అమ్మవారి కృపతో ఏలూరు నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ద్వారకాతిరుమల దేవస్థానం బోర్డు మెంబర్ చలువాది బ్రహ్మయ్య గారు,12వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కర్రి శ్రీను , మాజీ కార్పొరేటర్లు అద్దేపల్లి శ్రీనివాసరావు, కరణం గణేష్12వ డివిజన్ ఇంచార్జ్ తవ్వ అరుణ కుమారి ,15వ డివిజన్ ఇంచార్జ్ కున మాణిక్యం , నాయకులు సేనాపతి జయకృష్ణ ,కూని శెట్టి మురళి ,బద్రి ,పాతాళ రమణ ,శివశంకర్ ,సంతోష్ ,శివ పవన్ కుమార్ ,గంటా దుర్గారావు ,సేనాపతి శ్రీను ,విడిగట్టి సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
న్యూస్ బ్యూరో కే బాలసోరి ఏలూరు జిల్లా