BREAKING
డిసెంబర్ 1న వికారాబాద్‌కు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాక అచ్చంపేట ఎస్సీ రిజర్వేషన్ మరో 25 ఏళ్లు కొనసాగించాలి వత్సవాయిలో ప్రారంభమైన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ చంద్రారెడ్డి ఇంట విషాదం.. భార్య అనసూయ కన్నుమూత వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం

కేంద్ర మంత్రి కృషితో అత్తిలిలో అత్యాధునిక డయాలసిస్ కేంద్రం -- ఎన్‌ఎండీసీ నుంచి రూ.75 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో 7 అత్యాధునిక డయాలసిస్ మిషన్లు

Select Suryaa Now
కేంద్ర మంత్రి  కృషితో అత్తిలిలో అత్యాధునిక డయాలసిస్ కేంద్రం   -- ఎన్‌ఎండీసీ నుంచి రూ.75 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో 7 అత్యాధునిక డయాలసిస్ మిషన్లు

అత్తిలి, సూర్య న్యూస్ : అత్తిలి, పరిసర ప్రాంతాల డయాలసిస్ రోగులకు మెరుగైన వైద్య సేవలను స్థానికంగానే అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో అత్తిలిలో నూతన డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తన మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ  నుంచి రూ.75 లక్షల కార్పొరేట్ సామాజిక బాధ్యత  నిధులను మంజూరు చేయించి ఈ కేంద్రం ఏర్పాటుకు కృషి చేశారు. ఈ కేంద్రాన్ని సోమవారం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి  రాధాకృష్ణ ప్రారంభించనున్నారు.అత్తిలి, పరిసర ప్రాంతాల్లోని డయాలసిస్ రోగులు చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల వారు ప్రయాణ భారంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తణుకు ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యపై స్పందించిన శ్రీనివాస వర్మ, తన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్‌ఎండీసీ సంస్థ ద్వారా రూ.75 లక్షల సీఎస్‌ఆర్ నిధులు మంజూరు చేయించి డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన సహకారం అందించారు. మంత్రి చొరవతో ఈ కేంద్రం అందుబాటులోకి రావడంతో అత్తిలి ప్రాంత రోగులకు స్థానికంగానే డయాలసిస్ సేవలు పొందే అవకాశం కలగనుంది. తద్వారా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు రోగులు, వారి కుటుంబ సభ్యులకు ప్రయాణ ప్రయాసలు, ఆర్థిక భారం తగ్గనున్నాయి.అత్తిలిలోని లయన్స్ క్లబ్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏడు అత్యాధునిక డయాలసిస్ మిషన్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఐసీయూ బెడ్స్, డీఫిబ్రిలేటర్, మల్టీపారా మానిటర్లు, రెనాక్లీన్ మెషిన్ తదితర వైద్య సదుపాయాలను కల్పించారు. ఈ సదుపాయాల ద్వారా అత్తిలి, పరిసర ప్రాంతాల డయాలసిస్ రోగులకు వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి.

 కే బాలసౌరి న్యూస్ బ్యూరో ఏలూరు