BREAKING
డిసెంబర్ 1న వికారాబాద్‌కు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాక అచ్చంపేట ఎస్సీ రిజర్వేషన్ మరో 25 ఏళ్లు కొనసాగించాలి వత్సవాయిలో ప్రారంభమైన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ చంద్రారెడ్డి ఇంట విషాదం.. భార్య అనసూయ కన్నుమూత వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం

స్వచ్ఛ ఆంధ్ర అవార్డు గ్రహీత 'కొమ్ముల'కు కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ ఘన సత్కారం

Select Suryaa Now
స్వచ్ఛ ఆంధ్ర అవార్డు గ్రహీత 'కొమ్ముల'కు కేంద్రమంత్రి  శ్రీనివాసవర్మ ఘన సత్కారం

భీమవరం, సూర్య న్యూస్:ప్రముఖ సామాజిక సేవకులు, విజయ డయాగ్నస్టిక్ మెడికల్ ల్యాబ్ వ్యవస్థాపకులు కొమ్ముల మురళీకృష్ణను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఘనంగా సత్కరించారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రతిష్టాత్మక 'స్వచ్ఛ ఆంధ్ర' పురస్కారాన్ని అందుకున్న మురళీకృష్ణను భీమవరంలోని తన క్యాంపు కార్యాలయంలో కేంద్రమంత్రి సన్మానించి అభినందనలు తెలిపారు. ఇటీవల గాంధీ జయంతిని పురస్కరించుకుని విజయవాడలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మురళీకృష్ణ నిస్వార్థంగా అందిస్తున్న వైద్య, సామాజిక, పర్యావరణ, విద్యా సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసి, ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందజేసిన విషయం విదితమే. ఈ సందర్భంగా కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధికి, పేద ప్రజల ఆరోగ్య రక్షణకు మురళీకృష్ణ చేస్తున్న విశేష కృషి ఎంతో అభినందనీయం అని ఆయన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారం దక్కడం పశ్చిమ గోదావరి జిల్లాకే గర్వకారణం అని కొనియాడారు. భవిష్యత్తులో మురళీకృష్ణ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, పేదలకు, సమాజానికి మరింతగా సేవ చేయాలని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ఆకాంక్షించారు.

 రిపోర్టర్ శ్రీనివాస్ భీమవరం పశ్చిమగోదావరి జిల్లా