BREAKING
నేటి రాశి ఫలాలు – 12 అక్టోబర్ 2026 నేటి పంచాంగం: 12 అక్టోబర్ 2026, సోమవారం రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసమే తప్పుడు ఆరోపణలు నెక్కొండ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాలు ప్రారంభం క్రీడల్లో గెలుపు ఓటములు సహజం వెంకటాపురంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా నూతన కమిటీ ఎన్నిక మండల ఏర్పాటులో డాక్టర్ సుధాకర్ రావు దే కీలక పాత్ర దంతాలపల్లి లో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు మూడో టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించిన టీమిండియా నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యం రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు మిత్రునికి పదో తరగతి స్నేహితుల సన్మానం ‘సైమన్’ తుఫాను ముప్పు...ప్రజలు ఇళ్లలోనే ఉండాలని మెక్సికో అధ్యక్షురాలు హెచ్చరిక యూరప్ మార్కెట్లో పుంజుకునేందుకు చిన్న, చౌకైన ఈవీలపై స్టెలాంటిస్ భారీ పందెం ట్రంప్ రష్యన్ డీజిల్ ఒప్పందం చట్టవిరుద్ధం కావొచ్చు: రిపబ్లికన్ సెనేటర్

జీవితాన్ని మార్చే శక్తి చదువుకే ఉంది -- మంత్రి నిమ్మల --198 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ -- సంధ్య మెరైన్స్‌ సీఎస్‌ఆర్‌ నిధులతో సేవా కార్యక్రమం

Select Suryaa Now
జీవితాన్ని మార్చే శక్తి చదువుకే ఉంది               -- మంత్రి నిమ్మల --198 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ           -- సంధ్య మెరైన్స్‌ సీఎస్‌ఆర్‌ నిధులతో సేవా కార్యక్రమం

 

పాలకొల్లు, మేజర్ న్యూస్ :ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితాన్ని, తలరాతను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు బ్రాడీపేటలోని అల్లు వెంకట సత్యనారాయణ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న 198 మంది విద్యార్థినీ విద్యార్థులకు పూలపల్లి సంధ్య మెరైన్స్‌ సంస్థ సీఎస్‌ఆర్‌ నిధులతో అందించిన ఉచిత సైకిళ్లను సంస్థ డైరెక్టర్‌ కే. అరుణ్‌కుమార్‌తో కలిసి మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మంత్రికి, సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు స్వయంగా సైకిళ్లు అందజేసిన మంత్రి వారితో మమేకమై సైకిల్ తొక్కుతూ ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ చదువుతో రిక్షా కార్మికుడి కుమారుడు కలెక్టర్‌ కావచ్చని, సాధారణ పనులు చేసుకునే వారి పిల్లలు సైతం సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు. చిన్న గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన తాను ఉన్నత విద్యలో పీహెచ్‌డీ సాధించడం వల్ల అధ్యాపకుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగానని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువు పట్ల ప్రోత్సహించాలని సూచించారు. సేవా కార్యక్రమాల ద్వారా లభించే ఆనందం, తృప్తి మరెక్కడా లభించవని, అందుకే తన తండ్రి పేరుతో ధర్మారావు ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని చెప్పారు.పాలకొల్లు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులందరికీ ఉచిత సైకిళ్లు అందించాలని తొలుత భావించానని, సంస్థలు, కంపెనీలు అందిస్తున్న సహకారంతో ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులందరికీ దశలవారీగా సైకిళ్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ఈ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు అందజేయడంతో పాటు గోరింటాడలో శ్మశానవాటిక అభివృద్ధి పనుల కోసం పూలపల్లి సంధ్య మెరైన్స్‌ సంస్థ రూ.25 లక్షల సీఎస్‌ఆర్‌ నిధులు అందించిందని వెల్లడించారు. ఈ సహకారం అందించిన సంస్థ ఎండీ కే. ప్రసాద్‌, డైరెక్టర్లు అరుణ్‌కుమార్‌, ఆనంద్‌కుమార్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పాలకొల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ముందంజలో నిలిపామని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఐదేళ్ల పాలనలో నియోజకవర్గం వెనుకబడిందని మంత్రి విమర్శించారు. మళ్లీ కూటమి ప్రభుత్వంలో  రెండేళ్లలో అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.1,500 కోట్ల నిధులు తీసుకొచ్చానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో కీలకమైన జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ, జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ పాలకొల్లు ప్రజల అభివృద్ధి, సంక్షేమమే తన ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న రూ.200 కోట్ల విజ్జేశ్వరం మంచినీటి పథకం, పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి, విద్యుత్‌ వ్యవస్థ, టిడ్కో గృహాలను తిరిగి గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
సంధ్య మెరైన్స్‌ డైరెక్టర్‌ కే. అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ మంత్రి నిమ్మల రామానాయుడు చేపట్టిన విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులోనూ తమ సంస్థ తరఫున సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అరుణ్‌కుమార్‌ను మంత్రి నిమ్మల రామానాయుడు శాలువా కప్పి, గజమాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి గుమ్మల్ల వీరాస్వామి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కోడి విజయభాస్కర్‌, కూటమి నాయకులు పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, కర్నెన గౌరునాయుడు, ఉన్నమట్ల కబడ్డి, తుల రామలింగేశ్వరరావు, మీసాల రాము, పొట్నూరి వెంకట రమేష్‌, కొల్లు పవన్‌, గంధం సుబ్బారావు, పోలంకి మహేష్‌, పొట్నూరి శ్రీనివాస్‌, మహమ్మద్‌ జానీ, కొల్లి కొండ ప్రసాద్‌, బేరం శ్రీరామచంద్రమూర్తి, కొలుకులూరి జయప్రకాష్‌, పెనుమజ్జి మురళి, పీతల శ్రీనివాస్‌, రియా, ముప్పిరి సత్యనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కే. గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.