వెంకటాపురంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా నూతన కమిటీ ఎన్నిక
వెంకటాపురం , మేజర్ న్యూస్, వెంకటాపురం మండల కేంద్రంలోని ఏఎస్పీ కార్యాలయంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ములుగు జిల్లా నూతన జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ కమిటీ ఎన్నికకు ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు దాట్ల నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉయిక శంకర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీని ఉద్దేశించి దాట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ..5వ షెడ్యూల్ భూభాగంలో, ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏలకు పాలక ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని,వాటిని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు జిల్లా నూతన కమిటీ సభ్యులు ఉద్యమాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లి ఆదివాసీలను ఉద్యమాలకు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు ఉయిక శంకర్, రాష్ట్ర కార్యదర్శులు ఇర్ప రాజు, పాయం రమేష్, ఈకే నాగేశ్వరరావు, ఆదివాసీ ఉద్యోగ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి సుంచు సుధాకర్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు వాగబోయిన చంద్రయ్య, సోలం రామారావు, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సిద్ధబోయిన భాస్కర్, బంగారు సారంగపాణి, కల్తీ వినోద్, కనితి శేషారావు,బొగ్గుల సమ్మయ్య,శ్యామల వెంకటేశ్వర్లు,సోడి శరత్ కుమార్,ఉయిక జగన్, బొగ్గుల నారాయణ, ఉయిక గోపి,పీర్ల మల్లికార్జునరావు,సోడి నాగేంద్రబాబు,సోయం రాముడు, మడకం గోపి, ఉయిక సుబ్బయ్య, పరిష్కా రాజకుమారి,ఢిల్లీ ధనలక్ష్మి,కారం స్వరూప, కారం అనసూయ, యాలం సడాలి,ఉయిక జ్యోతి, బొగ్గుల గోపి,ఉయిక ప్రవీణ్, ఉయిక శివ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లా నూతన కమిటీ జిల్లా అధ్యక్షులు-కనితి శేషారావు
కార్యదర్శులు: బొగ్గుల సమ్మయ్య,శ్యామల వెంకటేశ్వర్లు,బొగ్గుల నారాయణ,సోడి శరత్ కుమార్,ఉయిక జగన్, సనప మోహన్ రావు, ఉయిక గోపి,వంక వెంకటేష్, గుమ్మడి నారాయణ,వర్షిక రాజకుమారి, కారం స్వరూప, ఢిల్లీ ధనలక్ష్మి, కారం అనసూయ,యాలం సడాలి
రిపోర్టర్, చక్రధర్, వెంకటాపూర్ , ములుగు జిల్లా