BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

దంతాలపల్లి లో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు

Select Suryaa Now
దంతాలపల్లి లో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు

దంతాలపల్లి, మేజర్ న్యూస్, మండల కేంద్రంలోని దంతాలపల్లి ఒకటవ వార్డులో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శివ పుత్ర యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలతో వార్డులో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారి నామస్మరణతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి.నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శక్తి స్వరూపిణి అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తిపారవశ్యంలో పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12 మంది భక్తులు మాలధారణ చేసి దీక్షను స్వీకరించారు.భక్తి, శక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే దేవీ నవరాత్రి ఉత్సవాలు వార్డులో పండుగ వాతావరణాన్ని నింపాయి. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు శివ పుత్ర యూత్ సభ్యులు ఏర్పాట్లు చేశారు.

రిపోర్టర్; రాములు గౌడ్, దంతాలపల్లి, మహబూబాబాద్ జిల్లా