రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు
మరిపెడ, మేజర్ న్యూస్, మండలం లోని ఎల్లంపేట గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. బైకు, కారు ఢీకొన్న ఘటనలో వీరారం గ్రామానికి చెందిన చింతల నగేష్, చింతల చరణ్ లకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు స్పందించి చికిత్స నిమిత్తం మహబూబాబాద్ జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు.
రిపోర్టర్; చందర్, మరిపెడ, మహబూబాబాద్ జిల్లా