BREAKING
నేటి రాశి ఫలాలు – 12 అక్టోబర్ 2026 నేటి పంచాంగం: 12 అక్టోబర్ 2026, సోమవారం రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసమే తప్పుడు ఆరోపణలు నెక్కొండ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాలు ప్రారంభం క్రీడల్లో గెలుపు ఓటములు సహజం వెంకటాపురంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా నూతన కమిటీ ఎన్నిక మండల ఏర్పాటులో డాక్టర్ సుధాకర్ రావు దే కీలక పాత్ర దంతాలపల్లి లో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు మూడో టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించిన టీమిండియా నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యం రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు మిత్రునికి పదో తరగతి స్నేహితుల సన్మానం ‘సైమన్’ తుఫాను ముప్పు...ప్రజలు ఇళ్లలోనే ఉండాలని మెక్సికో అధ్యక్షురాలు హెచ్చరిక యూరప్ మార్కెట్లో పుంజుకునేందుకు చిన్న, చౌకైన ఈవీలపై స్టెలాంటిస్ భారీ పందెం ట్రంప్ రష్యన్ డీజిల్ ఒప్పందం చట్టవిరుద్ధం కావొచ్చు: రిపబ్లికన్ సెనేటర్

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలి -- రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు డాక్టర్ పొలిమేర హరికృష్ణ విజ్ఞప్తి

Select Suryaa Now
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలి                          -- రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు డాక్టర్ పొలిమేర హరికృష్ణ విజ్ఞప్తి

ఏలూరు, సూర్య న్యూస్ :ఏపీలో జరగనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి జాతీయ కన్వీనర్, జాతీయ స్థాయి సీనియర్ దళిత నాయకుడు డాక్టర్ పొలిమేర హరికృష్ణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.ఏలూరు గన్ బజార్, తంగెలమూడి ప్రాంతాల్లో నిర్వహించిన ఎస్సీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రిజర్వేషన్ల ప్రక్రియలో లోపాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ఆ లోపభూయిష్టమైన ప్రక్రియను తాము అడ్డుకున్నామని హరికృష్ణ వెల్లడించారు.ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్ వర్గాలకు అన్యాయం జరగకుండా ఎన్నికల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని, రిజర్వేషన్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శక విధానాన్ని అనుసరించాలని ఆయన ఎన్నికల కమిషన్ ని  కోరారు.అలాగే, బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టులు కొట్టివేసినప్పటికీ, రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ ఆధారంగా కూటమి ప్రభుత్వం సగటున 28.18 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని హరికృష్ణ తెలిపారు.

సామాజిక న్యాయం, సమాన రాజకీయ అవకాశాల కల్పనకు రిజర్వేషన్ల ప్రక్రియ నిష్పక్షపాతంగా, చట్టబద్ధంగా కొనసాగాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘ నాయకులు, ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు దాసరి వెంకటేశ్వరరావు, పొదిలి బాబురావు, సొంగ రామ్మోహన్, బడుగు రామకృష్ణ, కొత్తపెళ్లి పోతురాజు, బి. గాంధీ, పింగళ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

 పసుమర్తి రాము జిల్లా ఇన్చార్జ్ ఏలూరు