BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

మండల ఏర్పాటులో డాక్టర్ సుధాకర్ రావు దే కీలక పాత్ర

Select Suryaa Now
మండల ఏర్పాటులో డాక్టర్ సుధాకర్ రావు దే కీలక పాత్ర

పెద్దవంగర, మేజర్ న్యూస్, పెద్దవంగర మండల ఏర్పాటులో దివంగత మాజీ ఎమ్మెల్యే డా.సుధాకర్ రావు మరియు దయాకర్ రావులదే కీలక పాత్ర అని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఈదురు ఐలయ్య  అన్నారు. పెద్దవంగర మండలం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు ఎర్రబెల్లి దయాకర్ రావుల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఈదురు ఐలయ్య మాట్లాడుతూ చిన్న మండలాల ఏర్పాటుతో అభివృద్ధి తొందరగా జరుగుతుందనే ఉద్దేశంతో, పరిపాలన సౌలభ్యం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో నూతన మండలాల ఏర్పాటులో భాగంగా పెద్దవంగర మండలాన్ని మాజీ ఎమ్మెల్యే దివంగత డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు కీలక పాత్రలో,దయాకర్ రావు ఆధ్వర్యంలో కేసీఆర్ పెద్దవంగర మండలాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామచంద్రయ్య శర్మ, శ్రీరామ్ సంజయ్, శ్రీరామ్ సుధీర్, కనుకుంట్ల వెంకన్న, సలిదండి సుధాకర్, రాసాల సమ్మయ్య, సర్పంచులు కుందూరు వెంకన్న, దంతాలపల్లి పరశురాములు, గుగులోత్ కవితాయాకన్న, నాయకులు సుదగాని రామ్మూర్తి, పసులేటి వెంకటరామయ్య, చింతల భాస్కర్, నిమ్మల విజయ, తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్, రామ్మూర్తి, పెద్దవంగర, మహబూబాబాద్ జిల్లా