మిత్రునికి పదో తరగతి స్నేహితుల సన్మానం
భీమదేవరపల్లి, మేజర్ న్యూస్, పదో తరగతిలో కలిసి చదువుకున్న తోటి మిత్రుడు, రిపోర్టర్ మాడుగుల రాజ్‌కుమార్‌కు అంతర్జాతీయ శాంతి ప్రతిభా పురస్కారం లభించడంతో పాటు, ఇటీవల భీమదేవరపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఆయన స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ముల్కనూరులో పదో తరగతి మిత్రబృందం ఆధ్వర్యంలో రాజ్‌కుమార్‌ను ఘనంగా సన్మానించి అభినందించారు. జర్నలిజం రంగంలో సేవలందిస్తూ అంతర్జాతీయ స్థాయి పురస్కారం అందుకోవడం, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం తమకు గర్వకారణమని మిత్రులు పేర్కొన్నారు. చిన్ననాటి నుంచి కొనసాగుతున్న స్నేహబంధాన్ని గుర్తుచేసుకుంటూ, రాజ్‌కుమార్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, జర్నలిజం రంగంలో మరింత గుర్తింపు పొందడంలో ఆయన విజయవంతం కావాలని ఆకాంక్షించారు.ఈ సన్మాన కార్యక్రమంలో మిత్రులు మాడుగుల గోపి, కొదురుపాక కుమారస్వామి, పారునందుల మహేందర్, మాడుగుల పరమేష్, పోలూ వెంకటేష్, కడారి ప్రశాంత్, గుర్రపు వెంకటేశ్వర్లు, దొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్; రామకృష్ణ, భీమదేవరపల్లి, హనుమకొండ జిల్లా