BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

మిట్స్‌ యూనివర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు

Select Suryaa Now
మిట్స్‌ యూనివర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు


- యూఐ గ్రీన్‌మెట్రిక్ ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌-2026లో చోటు
- ఛాన్సులర్ ఎన్.విజయ్ భాస్కర్ చౌదరి హర్షం  
మదనపల్లె,మేజర్ న్యూస్ : మదనపల్లె సమీపంలో గల (మదనపల్లె ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి యూఐ గ్రీన్‌మెట్రిక్ ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌-2026లో అంతర్జాతీయ గుర్తింపు లభించిందని యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్.విజయ భాస్కర్ చౌదరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో పర్యావరణ పరిరక్షణ,హరిత ప్రాంగణ అభివృద్ధి,ఇంధన పొదుపు,సహజ వనరుల సమర్థ వినియోగం,వ్యర్థాల నిర్వహణ,స్థిరమైన అభివృద్ధి వంటి అంశాల ఆధారంగా నిర్వహించిన ఈ ర్యాంకింగ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్న 2,016 విద్యాసంస్థల్లో మిట్స్‌ 704వ స్థానాన్ని సాధించిందన్నారు.అలాగే ఆసియాలో పాల్గొన్న 1,620 విద్యాసంస్థల్లో 419వ స్థానాన్ని,భారతదేశంలో పాల్గొన్న 68 విద్యాసంస్థల్లో 29వ స్థానాన్ని కైవసం చేసుకుందన్నారు.మొత్తం 110 దేశాలకు చెందిన విద్యాసంస్థలు పాల్గొన్న ఈ అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో మిట్స్‌ సాధించిన గుర్తింపు,పర్యావరణ పరిరక్షణ మరియు స్థిరమైన విద్యా వాతావరణం కల్పించడంలో యూనివర్సిటీ చూపుతున్న నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు.యూనివర్సిటీ ప్రాంగణంలో పచ్చదనాన్ని పెంపొందించడం,సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం,ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడం,నీరు మరియు ఇతర సహజ వనరులను బాధ్యతాయుతంగా వినియోగించడం,వ్యర్థాల నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ నీటి నిర్వహణ వ్యవస్థలు,సౌరశక్తి వినియోగం,వ్యర్థాల నిర్వహణ,విద్యుత్ వాహనాల రూపకల్పన వంటి పర్యావరణహిత సాంకేతిక ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.ఈ ప్రాజెక్టులు విద్యార్థుల్లో సృజనాత్మకత,సాంకేతిక నైపుణ్యాలు,పర్యావరణ స్పృహను పెంపొందించడంతోపాటు నీటి సంరక్షణ,స్వచ్ఛమైన ఇంధన వినియోగం,కాలుష్య నియంత్రణ వంటి అంశాలకు దోహదపడతాయన్నారు.ఈ అంతర్జాతీయ గుర్తింపు యూనివర్సిటీ అధ్యాపకులు,సిబ్బంది,విద్యార్థుల సమిష్టి కృషికి లభించిన ప్రోత్సాహమన్నారు.ఈ కార్యక్రమంలో ప్రో-ఛాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్,వైస్‌ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్,రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్,ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్,డైరెక్టర్-అడ్మిషన్స్ డాక్టర్ దీపాంకర్ రాయ్,అసిస్టెంట్ డీన్-అక్రిడిటేషన్స్ డాక్టర్ ఏ.వి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లె నియోజకవర్గం ఇంచార్జి