ఒడిశా కళ్యాణ మండపం పై పోలీసులు మెరుపు దాడి
*భారీ ఎత్తున నగదుస్వాధీనం.
*కార్లు సెల్ ఫోన్లు సీజ్ చేసిన ఒడిశా పోలీసులు.
*పట్టుబడిన వారిలో ఆంధ్రప్రదేశ్ నేతలు?
కొత్తూరు ఒడిశా పర్లాకిమిడి ఒక కల్యాణ మండపం లో జరుగుతున్న పేకాట శిబిరం పై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడులలో
కొత్తూరు మండలానికి చెందిన నేతలు పోలీసులకు పట్టుబడ్డారు.పోలీస్ దాడులలో సుమారు డబ్బయి మంది పట్టు బడినట్లు సమాచారం.పట్టుబడిన వారిలో కొత్తూరు మండలం మెట్టూరు గ్రామానికి చెందిన దేశం పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ ఉన్నారు .పట్టుబడిన వారి నుండి 12 లక్షల నగదు ,కార్లు సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకొన్నట్లు సమాచారం. పోలీసులు పక్కా సమాచారం తో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఎపి చెందిన నేతలు,అధిక సంఖ్య లో ఉన్నట్లు తెలిసింది.