BREAKING
జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు సవాళ్లను దాటి భారత్‌పైనే వాల్‌స్ట్రీట్ గురి: భారీ పెట్టుబడులు, విస్తరణకు అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజాల కసరత్తు! మాంచెస్టర్ సినగాగ్ దాడి ఘటనపై బ్రిటన్ బహిరంగ విచారణ ప్రముఖుల భద్రతపై బ్రిటన్ సమీక్ష...మాజీ మంత్రి హత్య నేపథ్యంలో కీలక నిర్ణయం ఆర్‌బీఎల్ బ్యాంక్ క్యూ2 లాభాల్లో భారీ జంప్: 170 శాతం వృద్ధితో రూ. 482 కోట్లకు చేరిన నికర లాభం.. మెరుగుపడిన ఆస్తి నాణ్యత! తమిళనాడు గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నియామకం యూరోపియన్ యూనియన్‌కు 5,841 టన్నుల చక్కెర ఎగుమతులకు కేంద్రం అనుమతి: టీఆర్‌క్యూ కింద రాయితీ సుంకంతో ఎగుమతులు! 28 రోజుల తర్వాత ఇంటికి చేరుకున్న యూట్యూబర్ నందన.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ వైరల్!

సిక్కోలు మేయర్ పీఠం మహిళలదే...!

Select Suryaa Now
సిక్కోలు మేయర్ పీఠం మహిళలదే...!


కూటమి అస్త్రం జయంతి..?
లక్ష్మీదేవి దారెటు?
వైసీపీలోనూ ఆశావహుల పోటీ.. ధర్మాన వ్యూహంపై ఉత్కంఠ!
(శ్రీకాకుళం: సూర్య బ్యూరో)
సిక్కోలు మేయర్ పీఠం మహిళలకు కేటాయిస్తూ సోమవారం ప్రకటన వెలువడటంతో నగర రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన పార్టీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. కూటమిలో పైడిశెట్టి జయంతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి రాజకీయ భవిష్యత్తుపైనా చర్చ సాగుతోంది. వైసీపీలో పలువురు ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
జయంతికి కూటమి అండ!
మాజీ చైర్‌పర్సన్ పైడిశెట్టి జయంతికి కింజరాపు కుటుంబంతోపాటు ఎమ్మెల్యే గొండు శంకర్ మద్దతు ఉందన్న చర్చ నడుస్తోంది. గతంలో ఐదేళ్లు పట్టణ చైర్‌పర్సన్‌గా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. తండ్రి అందవరపు వరాహ నరసింహ రాజకీయ వారసత్వం కూడా ఆమెకు గుర్తింపును తెచ్చింది.
గత సార్వత్రిక ఎన్నికల నామినేషన్‌కు ఒక రోజు ముందు జయంతి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పట్లో లభించిన హామీల నేపథ్యంలోనే ఆమె పార్టీ మారారన్న ప్రచారం ఉంది. ఇప్పుడు మేయర్ పదవి మహిళలకు కేటాయించడంతో ఆమె అభ్యర్థిత్వంపై ఆసక్తి పెరిగింది. అయితే తుది నిర్ణయం అధికారికంగా వెలువడాల్సి ఉంది.
లక్ష్మీదేవికి రాజకీయ పరీక్ష!
మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి శ్రీకాకుళం నియోజకవర్గంలో రాజకీయ గుర్తింపు ఉంది. మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ భార్యగా, గతంలో ఎమ్మెల్యేగా ఆమె పనిచేశారు. అయితే గత ఎన్నికల్లో గొండు శంకర్‌కు టికెట్ దక్కడంతో ఆమె రాజకీయ ప్రాధాన్యం తగ్గిందన్న చర్చ ఉంది.
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గాలు ఒకే నియోజకవర్గంలో ఉండటంతో రెండు అధికార కేంద్రాలు ఏర్పడితే పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయన్న అభిప్రాయం కూటమి వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో లక్ష్మీదేవికి ఎమ్మెల్యే శంకర్‌తో సఖ్యత ఎంతవరకు కుదురుతుందన్నది కీలకంగా మారింది.
ఇటీవల లక్ష్మీదేవి తనయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవడం కూడా చర్చకు వచ్చింది. అయితే వారు అమెరికాలో స్థిరపడటం, కుటుంబం పూర్తిస్థాయిలో శ్రీకాకుళం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో లక్ష్మీదేవి మేయర్ పదవిపై ఆశలు పెట్టుకుంటారా? లేక వేచి చూసే ధోరణి అనుసరిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
వైసీపీకి లక్ష్మీదేవి ప్రత్యామ్నాయమా?
ఒకవేళ లక్ష్మీదేవి కూటమిలో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటే, వైసీపీ ఆమెకు అవకాశం కల్పించవచ్చన్న ప్రచారం వినిపిస్తోంది. అయితే ఆమె పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే విషయంపై స్పష్టత లేదు. వైసీపీ నుంచి కూడా పలువురు మహిళా నేతలు మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
గతంలో చైర్‌పర్సన్‌గా పనిచేసిన పద్మావతి పేరు కూడా పోటీలో వినిపిస్తోంది. ఆమె తన కుమారుడు స్వరూప్‌తో కలిసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అందవరపు సూరిబాబు కుటుంబం నుంచి మహిళా అభ్యర్థి పేరు తెరపైకి రావచ్చన్న ప్రచారం కూడా ఉంది.
ధర్మాన వ్యూహం ఏమిటి?
వైసీపీలో ఆశావహులు పెరుగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయత, స్థానిక నాయకుల బలం వంటి అంశాలు అభ్యర్థి ఎంపికలో ప్రభావం చూపనున్నాయి. ఎవరికి మద్దతు ఇవ్వాలి? ఎవరిని బరిలోకి దించాలి? అన్న విషయంలో ధర్మాన వ్యూహం ఎలా ఉంటుందన్నది చూడాలి.