BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

పలాస-కాశీబుగ్గ పీఠం.. జనరల్ మహిళకే!

Select Suryaa Now
పలాస-కాశీబుగ్గ పీఠం.. జనరల్ మహిళకే!

 

బరిలో ఇద్దరు మాజీ చైర్మన్ల సతీమణులు.. వజ్జ గంగాభవాని - కోత అరుణకుమారి!

పలాస, అక్టోబర్ 12, మేజర్ న్యూస్.

ప్రభుత్వం మున్సిపాలిటీ చైర్ పర్సన్ రిజర్వేషన్ల నోటిఫికేషన్ సోమవారం విడుదల చేయడంతో పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. చైర్మన్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో చైర్మన్ అవుదామనుకున్న తెలుగు తమ్ముళ్ల ఆశలు ఆవిరయ్యాయి.

జనసేనకు పలాస? అరుణకుమారికి లైన్ క్లియర్?

కూటమి పొత్తులో భాగంగా శ్రీకాకుళం కార్పొరేషన్, ఆమదాలవలస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలు టీడీపీకి దక్కితే, మిగిలిన పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ జనసేనకు వెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.అదే జరిగితే జనసేన అభ్యర్థిగా కోత అరుణకుమారి పేరు దాదాపు ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె జనసేన నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు సతీమణి. 2014-19లో భర్త చైర్మన్ గా ఉన్నప్పుడు చిన్నబాడాం కౌన్సిలర్ గా ఐదేళ్లు పనిచేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. కాలింగ సామాజికవర్గంలో పట్టు, ఆర్థిక బలం, క్యాడర్ లో పట్టు ఆమెకు ప్లస్ పాయింట్లు.

టీడీపీ నుంచి గంగాభవాని.. అధిష్టానం వ్యూహమేనా?

ఒకవేళ పలాస మున్సిపాలిటీ టీడీపీకే దక్కితే మాత్రం అభ్యర్థిగా ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు సతీమణి వజ్జ గంగాభవాని రేసులో ముందున్నారు.గంగాభవాని గతంలో కౌన్సిలర్ గా చేశారు. ఆమె భర్త బాబూరావు 2002లో ప్రత్యక్ష ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నా, అప్పటి కాంగ్రెస్ అగ్రనేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి పలాస-కాశీబుగ్గకు ప్రథమ చైర్మన్ గా గెలిచారు. తర్వాత వైఎస్ మరణం అనంతరం జగన్ స్థాపించిన వైసీపీలో కీలకంగా పనిచేసి 2014లో పలాస నుంచి పోటీ చేశారు. 2015 నుంచి టీడీపీలో కొనసాగుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం ఇచ్చింది, ఆ పదవి నవంబర్ తో ముగుస్తుంది.అందుకే ఆర్థికంగా, రాజకీయంగా బలమైన బాబూరావు కుటుంబానికి మళ్లీ ప్రాధాన్యం ఇచ్చేందుకే పలాసను జనరల్ మహిళకు కేటాయించారన్న టాక్ కూడా వినిపిస్తోంది. గంగాభవానిని నిలబెడితేనే ఇక్కడ ఈజీగా గెలవచ్చని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.మొత్తానికి నోటిఫికేషన్ తో పలాసలో ఇద్దరు మాజీ చైర్మన్ల సతీమణుల మధ్య పోటీ ఖాయమైందనే చర్చ జరుగుతోంది.